ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ కు రామ్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా.. ఇదీ ఈ హీరో రేంజ్ అనేలా?

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని( Hero Ram Pothineni ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.హీరో రామ్ పోతినేని గత ఏడాది ది వారియర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

 Ram Remuneration For Ismart Shankar Sequel Is Highest In His Carrier, Ram Pothin-TeluguStop.com

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించిన విధంగా డిజాస్టర్ గా నిలిచింది.

డైరెక్టర్ లింగుస్వామి( Director Linguswamy ) ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఇకపోతే హీరో రామ్ పోతినేని ప్రస్తుతం డైరెక్టర్ బోయపాటి శ్రీను( Director Boyapati Srinu ) దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Telugu Ismartshankar, Puri Jagannath, Ram Pothineni, Tollywood-Movie

ఈ సినిమాలో ఊర మాస్ హీరోగా పరిచయం కాబోతున్నాడు రామ్ పోతినేని.ఇది ఇలా ఉంటే రామ్ పోతినేని ఇటీవల కాలంలో వరుసగా క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తూ దూసుకుపోతున్నరు.కాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా పూర్తయిన వెంటనే రామ్ బ్లాక్‌ బస్టర్ హిట్టైన ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్‌లో కూడా నటించాల్సి ఉంది.ఇక ఈ సినిమా కోసం రామ్ తన కెరీర్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

కాగా ఇస్మార్ట్ శంకర్( iSmart Shankar ) 2019లో విడుదలై బ్లాక్ బస్టర్ కాగా, పూరి జగన్నాధ్, రామ్ పోతినేని ఇద్దరికీ ఈ సినిమా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.

Telugu Ismartshankar, Puri Jagannath, Ram Pothineni, Tollywood-Movie

అందుకే ఈ సినిమా సీక్వెల్ కోసం వీరిద్దరూ కలిసి పని చేస్తున్నారు.ఈ సినిమాకి డబుల్ ఇస్మార్ట్ అని టైటిల్ ను కూడా ఖరారు చేశారు.ఇక ఈ సినిమా కోసం హీరో రామ్ తన కెరీర్‌లో అత్యధికంగా 15 కోట్ల రెమ్యునరేషన్( 15 crore remuneration ) తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

లైగర్ మూవీతో భారీ డిజాస్టర్ ను చవిచూసిన పూరి జగన్నాథ్ ఈ సినిమాతో తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వాలని అనుకుంటున్నారు.అందుకే డబుల్ ఇస్మార్ట్ అనే పాన్ ఇండియన్ సినిమాతో నటుడు రామ్ పోతినేనితో జతకట్టాడు.

ఇక ఈ సినిమా తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube