జూలై 14న రామ్ పోతినేని - లింగుస్వామి కలయికలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న 'ది వారియర్' విడుదల

ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఊర మాస్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘ది వారియర్’.ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.ఈ చిత్రాన్ని జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.

 Ram Pothineni's Bi-lingual ‘the Warriorr’ To Release On July 14, Srinivasa-TeluguStop.com

ఇప్పటివరకూ రామ్ పోలీస్ రోల్ చేయలేదు.‘ది వారియర్’ కోసం ఆయన తొలిసారి యూనిఫామ్ వేశారు. రామ్ పోతినేని – లింగుస్వామి కాంబినేషన్‌లో ఫస్ట్ మూవీ కావడం… తెలుగు – తమిళ భాషల్లో తెరకెక్కుతుండటం… రామ్ పోలీస్ రోల్… ఆది పినిశెట్టి విలన్ రోల్ చేయడం… ఈ సినిమాపై అంచనాలు పెంచాయి.

నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ… “కంటెంట్ అండ్ కమర్షియల్ వేల్యూస్ ఉన్న సినిమా ‘ది వారియర్’.జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నాం.

రామ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ‘ఇస్మార్ట్ శంకర్’ కూడా జూలై నెలలో విడుదలైంది.లింగుస్వామి స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్న కథతో ఊర మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ‘ది వారియర్’ను తీస్తున్నారు.

టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో తెరకెక్కిస్తున్నాం.పోలీస్ రోల్‌లో రామ్ పర్ఫెక్ట్ యాప్ట్.‘ది వారియర్’లో కొత్త రామ్‌ను చూస్తారు.హీరోతో ఢీ అంటే ఢీ అనే పాత్రలో అది పినిశెట్టి అద్భుతంగా నటిస్తున్నారు.

ప్రస్తుతం మేడ్చల్ రైల్వే స్టేషన్‌లో ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నాం.విజయ్ మాస్టర్ నేతృత్వంలో భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నాం.

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సూపర్బ్ సాంగ్స్ ఇచ్చారు.ప్రేక్షకులకు విందు భోజనం లాంటి చిత్రమిది” అని చెప్పారు.

తెలుగు, తమిళ భాషల్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘ది వారియర్‘లో రామ్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు.అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించనున్నారు.ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కళ: డి.వై.సత్యనారాయణ, యాక్షన్: విజయ్ మాస్టర్ & అన్బు-అరివు, ఛాయాగ్రహణం: సుజీత్ వాసుదేవ్, మాటలు: సాయిమాధవ్ బుర్రా – లింగుస్వామి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాణ సంస్థ: శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్, స‌మ‌ర్ప‌ణ: ప‌వ‌న్ కుమార్‌, నిర్మాత‌: శ్రీ‌నివాసా చిట్టూరి, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శ‌క‌త్వం: ఎన్‌.లింగుస్వామి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube