ఈ ఏడాది భారీ అంచనాల మధ్య వచ్చిన ప్రతీ సినిమా ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి.చిన్న సినిమాలు ఈ ఏడాది టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని చాలా వరకు కాపాడాయి.
కానీ చిన్న సినిమాల ద్వారా వచ్చిన లాభాలను, పెద్ద సినిమాలు చేస్తున్న నష్టాలు మింగేస్తున్నాయి.రీసెంట్ గా వచ్చిన మరో పెద్ద సినిమా ‘స్కంద'( Skanda ) కూడా బయ్యర్స్ కి భారీ నష్టాలను కలుగచేసే విధంగా ముందుకు వెళ్తుంది.
బోయపాటి శ్రీను లాంటి మాస్ డైరెక్టర్, రామ్ లాంటి యంగ్ అండ్ ఎనెర్జిటిక్ హీరో తో కలవడం వల్ల ఓపెనింగ్స్ అన్నీ ప్రాంతాల్లో అదిరాయి.మొదటి రోజు ఈ చిత్రానికి దాదాపుగా 9 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఇది రామ్ కెరీర్ లోనే ఆల్ టైం రికార్డు గా చెప్పుకోవచ్చు.కానీ ఈ చిత్రానికి ఇంకా ఎక్కువ వసూళ్లు రప్పించేంత కెపాసిటీ ఉంది, కానీ టాక్ బాగాలేకపోవడం తో 10 కోట్ల రూపాయిల లోపే షేర్ వసూళ్లు వచ్చాయి.

కానీ రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కేవలం మూడు కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.ఇది బీలో యావరేజి వసూళ్లు అని చెప్పొచ్చు.ఈ చిత్రం వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్( Worldwide Theatrical Rights ) దాదాపుగా 50 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది.బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఈ చిత్రం ఈ స్థాయి ట్రెండ్ ని మైంటైన్ చేస్తే అసలు వర్కౌట్ అవ్వదు.
వీకెండ్ లోనే ఇంత తక్కువ వసూళ్లు వస్తే , ఇక సోమవారం నుండి చిల్లర కూడా వచ్చే అవకాశం లేదు.ఫుల్ రన్ లో కనీసం 30 కోట్ల రూపాయిలు నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
ట్రేడ్ పరంగా ఇది ఈ ఏడాది విడుదలైన సినిమాలలో అతి పెద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఒకటిగా పరిగణించొచ్చు.అఖండ తర్వాత బోయపాటి శ్రీను( Boyapati Srinu ) కి ఇలాంటి ఫలితం రావడం బాధాకరం.

కానీ బోయపాటి శ్రీను కి ఇది డేంజర్ బెల్ లాంటిది.సినిమాలో కేవలం మాస్ సన్నివేశాలు( Mass Scenes ) మాత్రమే కాకుండ, కథ మీద కాస్త ద్రుష్టి పెట్టాలి.సెన్స్ లేని సన్నివేశాలన్నీ బోయపాటి సినిమాల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి.ఇప్పుడు ఆడియన్స్ మైండ్ సెట్ ఒకప్పటి లాగ లేదు, ట్రెండ్ బాగా మారింది.కేవలం మాస్ ఆడియన్స్ మాత్రమే థియేటర్ కి వస్తే సరిపోదు.అన్నీ వర్గాల ప్రేక్షకులు కూడా రావాలి, అప్పుడే సినిమాలు సక్సెస్ అవుతాయి.
కానీ బోయపాటి శ్రీను ఇది విస్మరిస్తున్నాడు.ఆయన సినిమాలు ఇప్పుడు మాస్ ఆడియన్స్ కి కూడా చిరాకు పుట్టే లాగ ఉన్నాయి.
పద్దతి మార్చుకోకపోతే బాలయ్య తప్ప బోయపాటి శ్రీను కి మరో హీరో అవకాశం ఇవ్వడు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.