యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని హీరోగా యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కించిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”స్కంద”( Skanda ). ఈ సినిమాలో రామ్ సరసన మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండడంతో ఈ సినిమా హిట్ అవుతుంది అని కాన్ఫిడెంట్ తో ఉన్నారు.
ఇక బోయపాటి అంటేనే ఫుల్ ఊర మాస్ కావడంతో యాక్షన్ ప్రేమికులంతా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

అందులోను బాలయ్యకు ‘అఖండ'( Akhanda ) వంటి బ్లాక్ బస్టర్ అందించిన బోయపాటి రామ్ కు కూడా బ్లాక్ బస్టర్ ఇస్తాడేమో అని ఆయన ఫ్యాన్స్ సైతం ఎదురు చూస్తున్నారు.అఖండ క్రేజ్ తో ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది.రామ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించడం కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచడంలో సహాయ పడింది.
ఇక మాస్ పల్స్ బాగా తెలిసిన బోయపాటి( Boyapati ) వారికీ కనెక్ట్ అయ్యేలా ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ను పెట్టి కథ ఎలా ఉన్న సక్సెస్ లను అందుకుంటున్నాడు.ఇక ఈ సినిమాలో కూడా లాస్ట్ 30 నిముషాల్లో యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవల్లో ఉంటాయని తెలుస్తుంది.
ఇలా ఇండస్ట్రీ వర్గాల నుండి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తుండడంతో భారీ హిట్ అయితే బోయపాటి మరో ప్లాన్ వేసాడు.

ఈ సినిమా ఒకవేళ భారీ హిట్ అయితే స్కంద 2( Skanda 2 ) ను కూడా ప్లాన్ చేసారని అందుకు కావాల్సిన లీడ్ కూడా విడిచిపెట్టారని సమాచారం.చూడాలి మరి రామ్ ఆశలన్నీ ఈ సినిమా మీద ఉండడంతో మాస్ హీరోగా కావాలనే కోరిక తీరుతుందో లేదో.ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 28న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
ఇదిలా ఉండగా థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.







