రామ్ మందిర్: అక్కడ 21 ఏళ్ల తర్వాత తెరుచుకున్న రాములోరి గుడి తలుపులు..!

నక్సల్స్ ఎక్కువగా ఉన్న రాష్ట్రలలో ఒకటైన ఛత్తీస్ ఘడ్( Chhattisgarh ) లో ఉన్న సుక్మా జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో దాదాపు 21 ఏళ్ల తర్వాత పోలీసులు చొరవతో రాముడిమందరం( Rama mandir ) తలుపులు తెరుచుకున్నాయి.జిల్లాలోని చింతల్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పూర్తిగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన కేరళపెండ గ్రామంలో ఓ ప్రాచీనమైన రాముడి గుడి ఉంది.

 Ram Mandir The Doors Of The Ramulori Temple Opened There After 21 Years, Crpf, P-TeluguStop.com

ఈ గుడి 2003 సంవత్సరంలో మావోయిస్టులు ( Maoists )మూసివేసారని గ్రామస్తులు తెలుపుతున్నారు.ఇక అప్పటి నుంచి నక్సలైట్ల భయంతో ఆ గ్రామస్తులలో ఒక కుటుంబం తప్పించి ఎవరు గుడికి వెళ్లలేదని తెలుస్తోంది.సదరు కుటుంబ సభ్యులు కూడా రహస్యంగా వెళ్లి గుడిలో దేవుడికి పూజలు నిర్వహించేవారు.ఇకపోతే తాజాగా ఆలయ సమీపంలోని లకపాల్ లో భద్రత సిబ్బంది కొత్త క్యాంపు ఏర్పాటు చేసుకున్నాయి.

ఇందులో భాగంగా సిఆర్పిఎఫ్ ( CRPF )భద్రత బలగాల సంబంధించిన జవానులు ఆ గ్రామానికి చేరుకొని గ్రామస్తుల కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు.

ఇందులో భాగంగానే.ప్రజలు అక్కడి జవాన్లకి పరిస్థితిని తెలిపారు.గ్రామస్తులు అడిగిన కోరిక మేరకు జవాన్లు గుడి తలుపులు తెరిపించి మందిరాన్ని శుభ్రం చేపించి ఆపై రాముడు మందిరంలో పూజలు నిర్వహించారు.

గుడి తెరవగానే గ్రామస్తుల ముఖాల్లో ఆనందం వెళ్లి వెరిసింది.గుడి తెరుచ్చుకున్న తర్వాత జవాన్లు, గ్రామస్తులందరూ కలిపి రామ మందిరంలో ఉన్న పురాతన రాముడు, సీత, లక్ష్మణ విగ్రహాలకు పూజలు నిర్వహించారు.

ఆ ఆలయం చాలా పురాతనమైందని అసలు ఎవరు ఈ ఆలయాన్ని నిర్మించారన్న విషయం కూడా గ్రామస్తులకు తెలియదని సమాచారం.అక్కడి గుడి పరిస్థితి చూస్తే.దాదాపు 5 దశాబ్దాల కిందటే నిర్మించినట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube