ఆస్కార్ అవార్డు ఆర్ఆర్ఆర్ కి కాకుండా కచ్చితంగా ఆయనకే ఇవ్వాలి: వర్మ

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో దర్శకుడు రామ్ గోపాల్ (Ramgopal Varma) వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇలా దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వర్మ ఈ మధ్యకాలంలో వివాదాస్పద సినిమాలు చేస్తూ వార్తలలో నిలుస్తున్నారు.

ఈ విధంగా ఏదో ఒక వివాదాస్పద సినిమా ద్వారా, లేదా సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద పోస్టులు చేస్తూ తరుచు వార్తలు నిలుస్తున్నారు.తాజాగా ఈయన తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ (Nara Lokesh) గురించి చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

నారా లోకేష్ ప్రస్తుతం యువగళం(Yuvagalam) పేరిట పాదయాత్ర చేస్తున్న విషయం మనకు తెలిసిందే.చిత్తూరులో ప్రారంభమైన పాదయాత్ర రాయలసీమలోని నాలుగు జిల్లాలలో పాదయాత్రను పూర్తి చేసుకున్నారు.ఇలా రాయలసీమలో పాదయాత్ర పూర్తి చేసుకున్న తర్వాత ఈయన నేలను తాకుతూ నమస్కరించినటువంటి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఫోటోని రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన స్టైల్లో చాలా సెటైరికల్ గా ట్వీట్ చేయడం ప్రస్తుతం వైరల్ గా మారింది.

Advertisement

ఈ సందర్భంగా ఈ ఫోటోని షేర్ చేసిన వర్మ ఈ ఫోటో గురించి స్పందిస్తూ చలనచిత్ర పరిశ్రమలో అందించే అవార్డులలో ఆస్కార్ అవార్డు(Oscar Award) ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు.ఇలా మన తెలుగు చిత్ర పరిశ్రమకు ఆర్ఆర్ఆర్ సినిమా (RRR Movie) అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఆ అవార్డు రాజమౌళి,కీరవాణి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు కాకుండా కచ్చితంగా నారా లోకేష్ కి ఇవ్వాలి అంటూ ఈయన లోకేష్ పై సెటైరికల్ గా చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈ క్రమంలోనే వర్మ చేసిన పోస్ట్ పై పలువురు తమ స్టైల్ లో కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు