'గేమ్ ఛేంజర్' రిలీజ్ పై టీమ్ తర్జనభర్జనలు.. ఫైనల్ గా చరణ్ టీమ్ నిర్ణయం ఏంటో!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కు ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా పేరు ఉంది.

ఈయన గత సినిమా ఆర్ఆర్ఆర్ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ట్రిపుల్ ఆర్ సినిమాతో సంచలన విజయం అందుకుని గ్లోబల్ వైడ్ గా మార్కెట్ సొంతం చేసుకున్న చరణ్ నెక్స్ట్ సినిమాపై ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.ఇటీవల ఈ సినిమాకు ఆస్కార్ రావడంతో ఈయన క్రేజ్ మరింత పెరిగింది.

ఇక ప్రజెంట్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో గేమ్ ఛేంజర్ (Game Changer) ఒకటి.రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా టైటిల్ ను ప్రకటించారు.

ఈ టైటిల్ పై మెగా ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

Advertisement

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి.

చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో గ్రామీణ యువకుడిగా ఒక పాత్ర అయితే అల్ట్రా స్టైలిష్ లుక్ లో మరో పాత్ర అని తెలుస్తుంది.ఈ స్టైలిష్ లుక్ నే బర్త్ డే రోజు రిలీజ్ చేసారు.ఇదిలా ఉండగా తాజా నివేదికల ప్రకారం ఈ సినిమా రిలీజ్ విషయంలో మేకర్స్ కసరత్తులు చేస్తున్నారట.

ఈ సినిమాను ముందుగా ఈ సమ్మర్ కే రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్టు టాక్ వచ్చింది.

కానీ ఇప్పుడు చూస్తే.ఈ ఏడాది డిసెంబర్ లో కానీ లేదంటే సంక్రాంతికి వచ్చే ఏడాది బరిలో నిలపాలి అని నిర్మాతలు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది.అయితే ఇప్పుడు శంకర్ చేస్తున్న ఇండియన్ 2 మూవీకి ( Indian 2 ) ఈ రెండిటిలో ఏదో ఒక డేట్ ఫిక్స్ అయితే గేమ్ ఛేంజర్ వచ్చే ఏడాది సమ్మర్ కు వెళ్లే అవకాశం కూడా లేకపోలేదని టాక్.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?

దీంతో మేకర్స్ పర్ఫెక్ట్ డేట్ కోసం తర్జన భర్జనలు పడుతుందని తెలుస్తుంది.మరి ఫైనల్ గా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు