సోషల్ మీడియాలో కొత్తగా ట్రెండ్ అవుతున్న బనానా కాఫీ.. దీనివల్ల ఎన్ని ప్రయోజనాలో?

సాధారణంగా చాలామంది ఎక్కువగా టీ, కాఫీని( Tea , coffee ) తాగడానికి ఇష్టపడతారు.టీ కంటే ఎక్కువగా కాఫీని ఇష్టపడతారు.

 Banana Coffee Is A New Trend On Social Media How Many Benefits Does This Have ,-TeluguStop.com

ఇక కాఫీ ని ఎన్నో రకాలుగా తయారు చేసుకుని తాగుతారు.ఇక దాని రుచి బాగుంటే వాటిని సోషల్ మీడియా లో షేర్ చేస్తారు.

సోషల్ మీడియాలో అలాంటి ఒక ట్రెండ్ ఇప్పుడు వైరల్ గా మారింది.అదే బనానా కాఫీ.

దీన్ని పాలు లేకుండానే తయారు చేయవచ్చు.దీనికోసం కేవలం రెండు పదార్థాలు ఉంటే చాలు.

చాలా సింపుల్ గా రెడీ చేసుకుని తాగవచ్చు.అయితే తాజాగా తయారు చేసిన బ్లాక్ కాఫీ( Black coffee ), అలాగే ఫ్రీజింగ్ చేసిన అరటిపండు ఉంటే చాలు.

అరటి కాఫీ వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి.ఎందుకంటే ఈ కాఫీ రుచికరంగా మాత్రమే కాదు పోషకాలతో కూడా నిండి ఉంది.

అరటి పండులో డైటరీ ఫైబర్ తో పాటు మల్టిపుల్ మినరల్స్, విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి.దీన్ని తీసుకుంటే రోజంతా యాక్టివ్ గా ఉండవచ్చు.

అయితే ఈ టీ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.మొదటిగా రెండు ఫ్రోజెన్ అరటిపండ్లు( Frozen bananas ), ఒక కప్పు కోల్డ్ డ్రిప్ కాఫీ తీసుకోవాలి.

ఇక ముందుగా కాఫీలో అరటి పండ్లు బాగా కరిగే వరకు కలపాలి.

పండిన పండ్లను తీసుకుంటే చాలా తియ్యగా ఉంటుంది.ఇక కోల్డ్ డ్రిప్ కాఫీ( Cold drip coffee ) కి బదులుగా ఒక కప్పు కోల్డ్ బ్రూ కాఫీ నీ అయినా ఉపయోగించవచ్చు.ఇక దీని రుచిని మరింత మెరుగుపరచుకోవాలంటే అందులో వెనీలా ఎక్స్ట్రాక్ట్, నట్ బటర్, దాల్చిన చెక్క, జాజికాయ, కోకో పౌడర్ లాంటి రుచికరమైన పదార్థాలను కూడా జోడించుకొని తయారు చేసుకోవాలి.

ఇక చాక్లెట్ ఇష్టపడేవారు చాక్లెట్ సిరప్ వేసుకొని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది.అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube