స్టార్ హీరో రామ్ చరణ్ సినీ కెరీర్ లో మగధీర, రంగస్థలం సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి.ఆర్ఆర్ఆర్ సినిమా ఆ రెండు సినిమాలను మించి సక్సెస్ సాధించడంతో పాటు రామ్ చరణ్ కెరీర్ లోనే ప్రత్యేక చిత్రంగా నిలిచి చరణ్ కు పాన్ ఇండియా హీరోగా గుర్తింపును తెచ్చిపెడుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
రామ్ చరణ్ కొన్నేళ్ల క్రితం జంజీర్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేయగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.
జంజీర్ కథ, కథనంలోని లోపాల వల్ల ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
తెలుగులో తుఫాన్ పేరుతో ఈ సినిమా రిలీజ్ కాగా తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి ఫలితం రాలేదు.అయితే ప్రస్తుతం ఆచార్యతో పాటు ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ నటిస్తుండగా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలో రామ్ చరణ్ ఒక చిన్న కుర్రాడితో కనిపించారు.

వైరల్ అవుతున్న ఫోటోలోని బాబుని ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతారామరాజు కాపాడతారని తాజాగా రాజమౌళి ఆ సీన్లకు సంబంధించిన ప్యాచ్ వర్క్ ను పూర్తి చేశారని సమాచారం.మరోవైపు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ డేట్ విషయంలో సస్పెన్స్ ను కొనసాగిస్తున్నారు.సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి లేదా సమ్మర్ కు రిలీజ్ కావచ్చని తెలుస్తోంది.