సినీ సెలబ్రెటీలపై రోజుకు ఒక్క కాంట్రవర్షియల్ కామెంట్ అయిన వస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.ఎందుకంటే ఇప్పటికే చాలామంది హీరోయిన్లపై హీరోలపై ఎఫైర్ వార్తలు వినిపించడం, డేటింగ్ వార్తలు వినిపించడం కొత్తేమీ కాదు.
అయితే గతంలో ఇలాంటి వార్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) విషయంలో కూడా వినిపించింది.
రామ్ చరణ్ ఉపాసన (Ram Charan-Upasana) కంటే ముందే మరో హీరోయిన్ ని పెళ్లి చేసుకొని కాపురం కూడా చేశారనే వార్తలు ఫిలింనగర్ లో చక్కర్లు కొట్టాయి.
మరి నిజంగానే రామ్ చరణ్ పెళ్లి చేసుకున్నారా.అసలు విషయం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.రామ్ చరణ్ ఉపాసన లవ్ ఎంతో ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.

అయితే ఇదంతా పక్కన పెడితే.రామ్ చరణ్ చిరుత (Chirutha) సినిమా లో నటించే టైంలో ఆ మూవీ హీరోయిన్ నేహా శర్మ (Neha sharma) ని ఇంట్లో వాళ్లేవరికి తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకొని హనీమూన్ కి కూడా వెళ్లాడని వార్తలు వినిపించాయి.

అయితే ఈ వార్తలను మెగా ఫ్యామిలీతో పాటు రామ్ చరణ్(Ram Charan),నేహా శర్మ ఖండించకపోవడంతో నిజమే అని అందరూ చెవులు కొరుక్కున్నారు.కానీ ఈ విషయంపై కొన్ని సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.ఈ వార్తలు నా మీద వచ్చినప్పుడు ఉపాసన (Upasana) కి కూడా క్లారిటీ ఇచ్చాను.
కానీ ఆమె ఈ వార్తలు అస్సలు నమ్మలేదు.అలాగే ఇంట్లో వాళ్లకు కూడా నా మీద వచ్చే అలాంటి వార్తలు నమ్మకండి అని చెప్పాను.ఇక ఇండస్ట్రీలో ఇలాంటి రూమర్స్ రోజుకి ఒక్కటైనా వస్తాయి అని రామ్ చరణ్ (Ram Charan) క్లారిటీ ఇచ్చారు.దాంతో ఈ రూమర్స్ కి చెక్ పడినట్లు అయింది.







