ఉపాసన బిడ్డ కోసం కానుకగా ఊయల... ఎవరు పంపించారు తెలుసా.... వైరల్ అవుతున్న ఫోటో!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan)ఉపాసన (Upasana) మరి కొద్ది రోజులలో తల్లిదండ్రులుగా ప్రమోట్ కానున్నారు.ఇలా పెళ్లి తర్వాత దాదాపు 11 సంవత్సరాలకు ఈ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న నేపథ్యంలో మెగా కుటుంబంలో సంతోషం నెలకొంది మరి కొద్ది రోజులలో మెగా వారసులు రాబోతున్న నేపథ్యంలో ఆ రోజు కోసం కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

 Ram Charan Upasana Welcome Newborn Baby Handcraft Cradle Details, Ramcharan,upas-TeluguStop.com

ప్రస్తుతం గర్భిణిగా ఉన్నటువంటి ఉపాసన సోషల్ మీడియా వేదికగా తన ప్రేగ్నెన్సీకి సంబంధించి ఏ చిన్న విషయం చెప్పిన క్షణాలలో వైరల్ అవుతుంది.

Telugu Cradel, Prajwala, Ramcharan, Upasana, Upasana Baby, Upasanababy-Movie

ఈ క్రమంలోనే తాజాగా ఉపాసన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు.ఇందులో భాగంగా తనకు పుట్టబోయే బిడ్డ కోసం ఒక ఊయలను(Cradel) తనకు కానుకగా పంపించారని చెప్పుకొచ్చారు.అయితే ఆ ఊయలను ఎవరు పంపించారు అనే విషయాలను కూడా ఉపాసన తెలియజేశారు.

తమకు పుట్టబోయే బిడ్డకు ప్రజ్వలా ఫౌండేషన్ (Prajwala Foundation) ఊయలను కానుకగా పంపించారని ఈ సందర్భంగా ఉపాసన తెలియజేశారు.ఈ ప్రజ్వలా ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది సెక్స్ ట్రాఫికింగ్ లో చిక్కుకున్నటువంటి మహిళలను రక్షించి వారికి ఈ ఫౌండేషన్ ద్వారా ఉపాధి కల్పిస్తున్నారు.

Telugu Cradel, Prajwala, Ramcharan, Upasana, Upasana Baby, Upasanababy-Movie

ఇలా ఈ ఫౌండేషన్ అలాంటి మహిళలకు ఉపాధితో పాటు ఆశ్రయం కూడా కల్పిస్తున్నారు.దీంతో ఈ ఫౌండేషన్ లో ఉన్నటువంటి మహిళలు ఉపాసన బిడ్డ కోసం ప్రత్యేకంగా ఈ ఊయలను తయారు చేసి కానుకగా పంపించారని తెలిపారు.ఇక ఆ మహిళలు తయారు చేసిన ఈ ఊయల అపారమైన ప్రాముఖ్యతను సంతరించుకొని ఉందని ఈమె తెలియజేశారు.ఈ ఊయలలో ఆ మహిళలోని ధైర్యం, బలం, ఆత్మగౌరవం, ఆశకు ప్రతీకగా తన బిడ్డకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

తన బిడ్డ పుట్టినప్పటినుంచి ఇలాంటి విషయాలకు బహిర్గతం కావాలని తాను కోరుకుంటున్నట్లు వెల్లడించారు.ఈ విధంగా తన బిడ్డ కోసం కోయలను కానుకగా పంపినందుకు ప్రజ్వలా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సునీత కృష్ణన్ కు ఈమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube