టాలీవుడ్‌లో షూటింగ్స్ హడావుడి లేకపోవడంతో గత కొన్ని రోజులుగా స్క్రిప్ట్‌పై చర్చలు జరుగుతున్నాయి.ఈమద్య కాలంలో చాలా సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్‌లు రెడీ అయ్యాయి అంటూ టాక్ వినిపిస్తుంది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తదుపరి చిత్రం ఎన్టీఆర్‌తో ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది.ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ రెడీ అయ్యింది.
ఈ సమయంలో ఆయన మరో స్క్రిప్ట్‌ను కూడా రెడీ చేసినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
గత నెల రోజుల వ్యవధిలో చరణ్‌ను త్రివిక్రమ్ మూడు సార్లు కలిసినట్లుగా తెలుస్తోంది.
వీరిద్దరి మద్య సుదీర్ఘ చర్చలు జరిగాయి అనేది ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.వీరిద్దరు కూడా కలిసి ఒక సినిమా చేసే అవకాశం ఉందని గత కొన్నాళ్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఈ సమయంలో వీరిద్దరికి సంబంధించిన చర్చలు ఖచ్చితంగా సినిమా కోసమే అంటూ బలంగా మెగా ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

చిరంజీవితో కూడా త్రివిక్రమ్ మూవీ ఉంటుందనే టాక్ వినిపిస్తుంది.ఈ సమయంలోనే చరణ్, త్రివిక్రమ్‌ల చర్చలు చిరంజీవి కోసం కూడా అయ్యి ఉంటాయి అంటూ కొందరు భావిస్తున్నారు.మొత్తానికి చిరంజీవి మరియు చరణ్‌లలో ఎవరితోనో ఒకరితో త్రివిక్రమ్ తదుపరి చిత్రం అంటూ తాజా పరిణామాలతో తేలిపోయింది.
ఎన్టీఆర్‌తో మూవీని ఈ ఏడాది చివర్లో ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్ వరకు పూర్తి చేయబోతున్నాడు.
ఆ తర్వాత చరణ్ లేదా చిరుతో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు.
ఆచార్య మరియు లూసీఫర్ చిత్రాలను లైన్‌లో పెట్టిన చిరు త్రివిక్రమ్‌తో మూవీ అంటే టైం పట్టే అవకాశం ఉంది.ఇక ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం తర్వాత చరణ్ ఇంకా దేనికి కమిట్ కాలేదు.
కనుక చరణ్ త్రివిక్రమ్‌ల మూవీకే ఎక్కువ అవకాశం ఉందంటున్నారు.