చరణ్ చేతుల మీదుగా 'భోళా శంకర్' ట్రైలర్.. ఎప్పుడంటే?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”భోళా శంకర్( Bhola Shankar )”.మరో రెండు వారాల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

 Ram Charan To Unveil Bhola Shankar Trailer, Bhola Shankar, Megastar Chiranjeevi,-TeluguStop.com

రిలీజ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్ లో వేగం పెంచేస్తున్నారు.చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళ్ వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.

తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.కీర్తి సురేష్( Keerthy Suresh ) చిరు చెల్లెలుగా నటిస్తుంది.మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 11న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకోగా తాజాగా భోళా శంకర్ ట్రైలర్ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.

మేకర్స్ తాజాగా అఫిషియల్ గా పోస్టర్ రిలీజ్ చేస్తూ ట్రైలర్ కు డేట్ అండ్ టైం ఫిక్స్ చేసారు.ఈ సినిమా ట్రైలర్ ను జులై 27న అంటే రేపు సాయంత్రం 4.05 గంటలకు డిజిటల్ గా రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.మరి ఈ ట్రైలర్ ఎవరు రిలీజ్ చేయబోతున్నారు అనే విషయం కూడా తెలిపారు.మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Rama charan ) చేతుల మీదుగా భోళా ట్రైలర్ రిలీజ్ కాబోతుంది.

దీంతో ఈ ట్రైలర్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు.మరి ఈ ట్రైలర్ తో మరిన్ని అంచనాలు పెంచేసి రిలీజ్ సమయానికి హైప్ ఇంకాస్త పెరిగితే ఓపెనింగ్స్ కుమ్మేయడం ఖాయం.

వరుసగా రెండు హిట్స్ అందుకున్న చిరు భోళా శంకర్ కూడా హిట్ అందుకుని హ్యాట్రిక్స్ హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతాయో లేదో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube