ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా RRR సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి.ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు రావడంతో దేశం మొత్తం ఈ విషయం గురించి మాట్లాడటమే కాకుండా పెద్ద ఎత్తున ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ఇలాంటి ఒక అద్భుతమైన పాటలో నటించిన ఎన్టీఆర్ రామ్ చరణ్ పేర్లు కూడా అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిపోతున్నాయి.ఇప్పటికే ఎంతో క్రేజ్ చేసుకున్నటువంటి రామ్ చరణ్ కు( Ram Charan ) తాజాగా మరొక అరుదైన గౌరవం లభించింది.

ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో( PM Narendra Modi ) పాటు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తో( Sachin Tendulkar ) కలిసి వేదికను పంచుకోబోతున్నారు.ఈ క్రమంలోనే ఈనెల 17 18 వ తేదీలలో న్యూఢిల్లీలో జరగబోయే ఇండియా టుడే కాన్ క్లేవ్ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ పాల్గొనబోతున్నారు.ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు.

ఇలా గొప్ప వ్యక్తులతో కలిసి రామ్ చరణ్ కూడా ఆవేదికను పంచుకోబోతున్నారని తెలియడంతో మెగా అభిమానులు ఇది రామ్ చరణ్ కు దక్కిన అరుదైన గౌరవం అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే రామ్ చరణ్ RRR సినిమాకు ఆస్కార్ రావడం గురించి మాట్లాడబోతున్నట్లు తెలుస్తోంది.అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌తో భారతీయ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసినందుకు మెగా పవర్‌స్టార్‌ని ప్రధాని మోడీ ఘనంగా సన్మానించబోతున్నారని సమాచారం.
ఏది ఏమైనా ఇలాంటి గొప్ప వ్యక్తులతో కలిసి వేదిక పంచుకునే అవకాశం రావడంతో అభిమానులు మాత్రం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.







