సల్మాన్ సినిమాలో చరణ్.. కామియో రోల్ అంటూ వైరల్ అవుతున్న న్యూస్!

మెగా కుటుంబం నుండి మెగాస్టార్ వారసుడిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి కొద్దీ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు రామ్ చరణ్ తేజ్.ఈయన టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్ నటించాడు.ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ అగ్ర డైరెక్టర్ శంకర్ తో సినిమా స్టార్ట్ చేసాడు.

 Ram Charan To Have A Cameo In Salman Khans Upcoming Film, Ram Charan, Cameo, Salman Khan, Director Shankar,kabhi Eid Kabhi Diwali, Pooja Hegdhe, Venkatesh, Rc15-TeluguStop.com

RC15 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.మెగా ఫ్యాన్స్ అంతా ఆర్సీ 15 సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

శంకర్ దర్శకత్వంలో సినిమా అంటే ఎలా ఉంటుందో అందరికి తెలుసు.అలాంటి అగ్ర దర్శకుడితో సినిమా చేస్తుండడంతో ఈ సినిమాపై పాన్ ఇండియా వ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్పడింది.

 Ram Charan To Have A Cameo In Salman Khans Upcoming Film, Ram Charan, Cameo, Salman Khan, Director Shankar,Kabhi Eid Kabhi Diwali, Pooja Hegdhe, Venkatesh, RC15-సల్మాన్ సినిమాలో చరణ్.. కామియో రోల్ అంటూ వైరల్ అవుతున్న న్యూస్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాగే ఈయనకు హిందీ లో కూడా మంచి డిమాండ్ ఏర్పడింది.

అయితే ఈ క్రమంలోనే రామ్ చరణ్ తేజ్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలో కామియో చేస్తున్నట్టుగా ఒక టాక్ నిన్నటి నుండి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

మరి ఈ వార్త ఎంత వరకు నిజం అనే విషయం తెలియదు.కానీ ఇది మాత్రం నెట్టింట ఓ రేంజ్ లో షేర్ అవుతుంది.ఈ వార్త నిజమైతే కనుక మన టాలీవుడ్ స్టార్ అక్కడ భారీ మార్కెట్ సొంతం చేసుకోవడం ఖాయం.

విక్రమ్ సినిమాలో సూర్య కామియో చేసిన విషయం తెలిసిందే.ఇక ఇప్పుడు చరణ్ కూడా ఈ రోల్ చేస్తాడేమో చూడాలి.ప్రెసెంట్ సల్మాన్ ఖాన్ కబీ ఈద్ కబీ దివాలీ అనే సినిమాలో నటిస్తున్నాడు.

సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఆమెకు అన్న పాత్రలో వెంకటేష్ నటిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి.

దీంతో తెలుగు ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఉన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube