చిరు 152లో డబుల్ ట్రీట్.. నిజమా అంటోన్న ఫ్యాన్స్?

సెన్సేషన్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఇటీవల షూటింగ్ మొదలుపెట్టింది.ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా రోజులు అయిన తరువాత ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టారు.

 Ram Charan To Act In Chiranjeevi Koratala Movie-TeluguStop.com

కాగా ఈ సినిమాలో మెగా ఫ్యాన్స్‌కు ఓ డబుల్ ట్రీట్ ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో మెగాస్టార్ చాలా స్టైలిష్ లుక్‌లో దర్శనమిస్తాడు.

సోషల్ మెసేజ్ సినిమాలు చేసే కొరటాల ఈ సినిమాలోనూ అదే రిపీట్ చేయనున్నాడు.ఇకపోతే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తాడని, ఆ పాత్ర ఆయనకు బాగా నచ్చడమే కాకుండా, ఆ పాత్రను చరణ్ కోసమే కొరటాల రాసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

అయితే చరణ్ చేయబోయే పాత్ర ఎలాంటిదనే విషయంపై క్లారిటీ లేదు.ఈ పాత్రకు సంబంధించి చిత్ర యూనిట్ ఎలాంటి విషయాన్ని బయటకు చెప్పలేదు.అసలు చరణ్ ఈ సినిమాలో నటిస్తాడా లేడా అనే సందేహం కొందరిలో మొదలైంది.ఏదేమైనా ఈ పాత్రకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చిత్ర యూనిట్ చెప్పాల్సి వస్తుంది.

ఒకవేళ ఈ సినిమాలో మెగాస్టార్, మెగా పవర్ స్టార్ కలిసి నటిస్తే మాత్రం ఫ్యాన్స్‌కు ఇది నిజంగా ట్రీట్ అని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube