సాధారణంగా ఇద్దరు యంగ్ జనరేషన్ స్టార్ హీరోలతో కలిసి సినిమాలను తెరకెక్కించడం దర్శకులకు సులువు కాదు.అయితే రాజమౌళి ఆర్.
ఆర్.ఆర్ మూవీతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు.చరణ్ తారక్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా 1000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకోవడంతో పాటు తెలుగు సినిమాలకు హిట్ టాక్ వస్తే ఏ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయో ప్రూవ్ చేసింది.
తాజాగా చరణ్ మాట్లాడుతూ తాను తారక్ కలిసి నాటు నాటు పాటకు మళ్లీ డ్యాన్స్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
సినిమాకు ఆస్కార్ వస్తే తారక్ తో కలిసి స్టేజ్ పై నాటు నాటు సాంగ్ కు డ్యాన్స్ చేసి దుమ్ము దులుపుతానని చరణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఆస్కార్ వస్తే ఒక్కసారి కాదు ఏకంగా 17సార్లు తారక్ తో కలిసి డ్యాన్స్ చేస్తానని చరణ్ కామెంట్లు చేశారు.
చరణ్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మార్చి నెల 12వ తేదీన ఆర్ఆర్ఆర్ ఈవెంట్ జరగనున్న సంగతి తెలిసిందే.నాటు నాటు సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చిన నేపథ్యంలో ఆర్.ఆర్.ఆర్ సినిమా గురించి చర్చ జరుగుతోంది.ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కితే చరణ్, తారక్ కలిసి మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం.
అసాధ్యాలను సైతం సుసాధ్యం చేస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్న రాజమౌళి టాలెంట్ కు సైతం ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.రాజమౌళి కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకోబోతున్నారో తెలియాల్సి ఉంది.జక్కన్న మరిన్ని విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.