అప్పుడు చిట్టిబాబు.. ఇప్పుడు ధరణి.. మార్చి 30 వీరికి బాగా కలిసొచ్చిందా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ (Ram Charan) తన కెరీర్ లో అందుకున్న బ్లాక్ బస్టర్ విజయాల్లో రంగస్థలం ( Rangasthalam ) ఒకటి.ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేయగా రామ్ చరణ్ హీరోగా నటించాడు.

 Ram Charan Rangasthalam Vs Nani Dasara Movie, Ram Charan, Rangasthalam,  Srikant-TeluguStop.com

మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా 2018, మార్చి 30న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఈ సినిమాలో చరణ్ చిట్టిబాబు గా నటించి తన లోని టాలెంట్ ను ప్రేక్షకులకు చూపించాడు.

చరణ్ ను చిట్టిబాబుగా కూడా గుర్తుపెట్టుకునేంతగా ఈయన ఈ పాత్రకు జీవం పోసాడు.రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాలో వీరిద్దరూ డీ గ్లామర్ రోల్స్ లో అదర గొట్టారు.

చిట్టిబాబుగా చరణ్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు.మరి యాక్షన్ అంశాలతో సుకుమార్ ఈ సినిమాను ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించి టాలీవుడ్ కు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు.

ఇక ఇప్పుడు సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల కూడా టాలీవుడ్ కు మరో యాక్షన్ బ్లాక్ బస్టర్ అందించాడు.ఈయన తాజాగా తెరకెక్కించిన పాన్ ఇండియన్ మూవీ ”దసరా” ( Dasara ).నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా నిన్న అంటే 2023, మార్చి 30న రిలీజ్ అయ్యింది.రా అండ్ విలేజ్ డ్రామా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాను సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కించారు.

ధరణి పాత్రలో నాని తనలోని మాస్ నటనను బయటకు తీసి ఆడియెన్స్ కు థ్రిల్ ఇచ్చాడు.క్లాస్ హీరో నుండి ఇలాంటి నటన ఎక్స్పెక్ట్ చేయని ఆడియెన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు.అంతేకాదు వరల్డ్ వైడ్ మాసివ్ ఓపెనింగ్స్ అందుకుని ఈ సినిమా వార్తల్లో నిలిచేలా చేసింది.ఇలా ఐదేళ్ల గ్యాప్ తో ఒకే డేట్ కు రిలీజ్ అయిన రెండు సినిమాలు కూడా సెన్సేషన్ సృష్టించాయి అనే చెప్పాలి.

చిట్టిబాబుగా చరణ్.ధరణిగా నాని (Nani) తమ సహజమైన నటనతో అందరిని ఆకట్టుకున్న వైనం ఇప్పుడు ఆడియెన్స్ లో ఇంట్రెస్టింగ్ చర్చకు దారి తీసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube