చరణ్ మూవీ ఆడియో రైట్స్ కు రికార్డ్ రేట్.. ఫ్లాపులొస్తున్నా చరణ్ క్రేజ్ తగ్గట్లేదుగా!

టాలీవుడ్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Tollywood hero global star Ram Charan) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

రాంచరణ్(Ram Charan) ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు చెర్రీ.చివరగా గేమ్ చేంజర్(Game changer) మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.ఈ సినిమా ప్రేక్షకులను దారుణంగా నిరాశపరిచింది.

ఇకపోతే ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు(Ram Charan ,Buchibabu) దర్శకత్వంలో పెద్ది అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.పక్కా స్పోర్ట్స్ అండ్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా రీసెంట్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో సాలిడ్ హైప్ ని అందుకుంది.

Ram Charan Peddi Audio Rights Deal Closed For Record Offer, Ram Charan, Peddi Mo
Advertisement
Ram Charan Peddi Audio Rights Deal Closed For Record Offer, Ram Charan, Peddi Mo

ఇక ఈ తరువాత గ్లింప్స్ డేట్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేయడంతో దాని కోసం అంతా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.మరి ఈ తర్వాత సినిమా ఆడియో హక్కులపై కూడా మేకర్స్ క్లారిటీ ఇచ్చేసారు.భారీ రీచ్ ఉన్న టీ సిరీస్ ఈ చిత్రాన్ని సొంతం చేసుకున్నట్టుగా రివీల్ చేయగా ఈ సినిమా ఆడియో రైట్స్(Audio Rights) భారీ ధరకి అమ్ముడు పోయినట్టుగా ఒక టాక్ ఇపుడు గట్టిగా వినిపిస్తోంది.

దీనితో పెద్ది సినిమా పాన్ ఇండియా భాషల ఆడియో హక్కులు టీ సిరీస్ వారు ఏకంగా 35 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.ఇది మన తెలుగు సినిమాల్లో అత్యధికం అన్నట్టు తెలుస్తోంది.

Ram Charan Peddi Audio Rights Deal Closed For Record Offer, Ram Charan, Peddi Mo

ఇక ఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.అలాగే వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.ఇక అవైటెడ్ గ్లింప్స్ ఈ ఏప్రిల్ 6న రామ నవమి కానుకగా రాబోతుందట.

అయితే ఇప్పుడు రామ్ చరణ్ ఆడియో రైట్స్ (Ram Charan audio rights)కు రికార్డులు స్థాయిలో ధర పలకడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ప్లాపులు వస్తున్న కూడా రామ్ చరణ్ క్రేజ్ తగ్గడం లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

శ‌రీరంలో ఫోలిక్ యాసిడ్ లోపిస్తే..ఏ స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా?

కాగా గేమ్ చేంజర్ డిజాస్టర్ అవ్వడంతో ఇప్పుడు చెర్రీ అభిమానులు ఆశలన్నీ కూడా పెద్ది సినిమా పైన పెట్టుకున్నారు.మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి మరి.

Advertisement

తాజా వార్తలు