ఎవ్వరు ఊహించని స్థాయిలో అమెరికాలో ఆర్ఆర్ఆర్ రిలీజ్.. అఫిషియల్ అనౌన్స్!

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా రిలీజ్ త్వరలోనే ఉంది.

 Ram Charan Ntr Rrr Grand Release In America Official Announcement Details, Ram C-TeluguStop.com

మరొక 8 రోజులు మాత్రమే ఉండడంతో ఈ సినిమా కోసం మరింత ఆతృతగా ఎదురు చూస్తున్నారు.దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమాను టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కించాడు.ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఎట్టకేలకు ఈ సినిమా మార్చి 25న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించడంతో ఆశగా చూస్తున్నారు.

రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ ఈ సినిమా గురించి ఒక్కో వార్త బయటకు వస్తుంటే మరింత ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది.ఇక మెగా మరియు నందమూరి ఫ్యాన్స్ మరింత ఆసక్తిగా వాళ్ళ అభిమాన హీరో సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది.దీంతో మొదటి రోజే రికార్డుల మోత మోగించేందుకు ఆస్కారం ఉందని తెలుస్తుంది.

తాజాగా మేకర్స్ ప్రకటించిన దాని ప్రకారం ఈ సినిమా అమెరికాలో ఏకంగా 1150 లొకేషన్లలో రిలీజ్ చేస్తున్నారట.మార్చి 24నే అమెరికాలో ప్రీమియర్స్ పడ్డాయి.ఈ విషయాన్నీ అమెరికా కూడా కన్ఫర్మా చేయడంతో ఇంతకు ముందు ఎప్పుడు వినిపించనన్ని స్క్రీన్ లలో విడుదల చేస్తున్నారని మేకర్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తుంది.

యుఎస్ తో పాటు దాదాపు 30 కి పైగానే దేశాల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం.ఇక ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రంగం సిద్ధం అయ్యిందని తెలుస్తుంది.ఈ నెల 19న బుర్జ్ ఖలీఫా లో ఆర్ఆర్ఆర్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

ఆ తర్వాత బెంగుళూరు లో మరొక ఈవెంట్ ఇక లాస్ట్ హైదరాబాద్ లో గ్రాండ్ ఈవెంట్ ప్లానింగ్ ఉంది.మరి ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎన్ని అంచనాలను పెంచేస్తుందో చూడాలి.

Ram Charan Ntr Rrr Grand Release In America Official Announcement Details

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube