రామ్ చరణ్( Ram charan ) కొత్త బ్యానర్ ను ఏర్పాటు చేశాడు.యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో వరుసగా సినిమాలను నిర్మిస్తున్న నిర్మాతల్లో ఒకరు అయిన విక్రమ్ తో కలిసి రామ్ చరణ్ కొత్త నిర్మాణ సంస్థ ని ఏర్పాటు చేయడం జరిగిందట.
వి మెగా పిక్చర్స్ బ్యానర్ ను ఏర్పాటు చేసిన వీరిద్దరు కలిసి చిన్న సినిమా లను నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది.కొత్త వారికి ఛాన్స్ లు ఇస్తూ సిరీస్ లను కూడా వీరిద్దరు నిర్మించాలని భావిస్తున్నారట.
గతంలో రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్( Konidela Productions ) అనే నిర్మాణ సంస్థని ప్రారంభించాడు.అదే సమయంలో మరో ప్రొడక్షన్ హౌస్ ని కూడా ప్రారంభించడం జరిగింది.
కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థలో వరుసగా సినిమాలు నిర్మాణం జరిగాయి.జరుగుతున్నాయి.
కానీ అదే సమయంలో మరో నిర్మాణ సంస్థను ప్రారంభించి అందులో చిన్న సినిమాలను నిర్మిస్తానంటూ ప్రకటించిన చరణ్ ఆ నిర్మాణ సంస్థను వదిలేసినట్లుగా తెలుస్తోంది.
మొత్తానికి రామ్ చరణ్ యొక్క కొత్త నిర్మాణ సంస్థ గురించి జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో అప్పటి నిర్మాణ సంస్థల గురించి చర్చ మొదలు అయ్యింది.రామ్ చరణ్ కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ తో చిన్న సినిమాలను నిర్మిస్తే పెద్ద సినిమాలుగా పబ్లిసిటీ దక్కే అవకాశం ఉంది.కనుక ప్రమోషన్ కోసం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.
అందుకే విక్రమ్ పెట్టుబడి పెట్టి నిర్మాత గా చరణ్ పేరును వేయడం ద్వారా సినిమాకు కలిసి వస్తుందని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అందుకే వి మెగా పిక్చర్స్ బ్యానర్ ను ఏర్పాటు చేసి ఉంటారు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో రామ్ చరణ్ వరుసగా వందల కోట్ల బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నాడు.ఇలాంటి సమయంలో చిన్న సినిమా ల కోసం ఆయన సమయం కేటాయించడం సాధ్యమా అంటే కచ్చితంగా కాదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.