టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ ప్రతి సంవత్సరం కొన్నిరోజుల పాటు దీక్ష చేపడతారనే సంగతి తెలిసిందే.
తను చేపట్టే దీక్ష గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
గత 15 సంవత్సరాల నుంచి నేను దీక్ష చేపడుతున్నానని ఆయన కామెంట్లు చేశారు.దేవుని చింతనే ప్రధానంగా జీవించడానికి మేము దీక్ష చేపడతాం అని రామ్ చరణ్ వెల్లడించడం గమనార్హం.
ఈ దీక్ష వ్యవధి 48 రోజులు ఉంటుందని చరణ్ చెప్పుకొచ్చారు.ఈ దీక్ష సమయంలో ప్రత్యేకమైన దుస్తులను ధరిస్తామని చరణ్ కామెంట్లు చేశారు.
దీక్ష సమయంలో మాంసం ముట్టుకోమని రామ్ చరణ్ అన్నారు.దీక్ష సమయంలో చన్నీళ్ల స్నానం మాత్రమే చేయాలని నేలపైనే పడుకోవాలని రామ్ చరణ్ కామెంట్లు చేశారు.
దీక్ష సమయంలో మహిళలను తాకకూడదని చరణ్ వెల్లడించారు.
దీక్ష సమయంలో ఎలాంటి లగ్జరీ లేకుండా బ్రతకాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.దీక్ష చేయడం వల్ల క్రమశిక్షణ వెలువడుతుందని చరణ్ తెలిపారు.శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండటానికి ఈ దీక్ష ఎంతగానో ఉపయోగపడుతుందని చరణ్ చెప్పుకొచ్చారు.15 ఏళ్లుగా చరణ్ దీక్ష చేస్తున్నారంటే చరణ్ నిజంగా గ్రేట్ అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
రామ్ చరణ్ త్వరలో హాలీవుడ్ సినిమాలతో బిజీ కానున్నారని సమాచారం.చరణ్ రేంజ్ ఊహించని స్థాయిలో పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.హాలీవుడ్ లో కూడా చరణ్ సక్సెస్ సాధించడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.
రామ్ చరణ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సంబంధించి ఏ డైరెక్టర్లకు లక్కీ ఛాన్స్ దక్కుతుందో చూడాలి.మరోవైపు రామ్ చరణ్ కొత్త సినిమాకు సీఈవో అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.
చరణ్ సినిమా ఆర్.ఆర్.ఆర్ ను మించిన బడ్జెట్ తో తెరకెక్కుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy