తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా పవర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడంతో చిత్ర బృందం అమెరికాలో సందడి చేస్తూ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే రామ్ చరణ్ అమెరికాలో ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరుకాగా తాజాగా ఈయన కేటీఎల్ఏ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రామ్ చరణ్ నాటు నాటు పాట ఆస్కార్ కి నామినేట్ కావడంపై స్పందించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఓ నటుడిగా ఈ విషయం తనకు ఎంతో సంతృప్తిని కలిగించే క్షణాలని తెలియజేశారు.ఆస్కార్ అవార్డు వేడుకలలో భాగంగా తాను ఒక అతిథిగా పాల్గొంటే చాలు అనుకున్నాను కానీ మేము నటించిన సినిమా ఇప్పుడు ఆస్కార్ కి నామినేట్ కావడం చాలా సంతోషాన్ని కలిగించిందని తెలిపారు.
వెంటనే ఆస్కార్ అవార్డు అందుకొని మా చిత్ర బృందంతో కలిసి మా దేశానికి వెళ్లాలని ఉంది అంటూ ఈయన తెలియచేశారు.
మా ఇండియాలో తెలుగు సినిమా పరిశ్రమకు 85 ఏళ్ల చరిత్ర ఉంది.ఇప్పుడు మీరు మమ్మల్ని గుర్తించి మా సినిమా చాలా అద్భుతంగా ఉందని అప్రిషియేట్ చేశారు.ఇలా తాను ఒక నటుడిగా వివిధ దేశాలలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ రామ్ చరణ్ నాటు నాటు పాట ఆస్కార్ కి నామినేట్ కావడం గురించి మాట్లాడుతూ తన సంతోషాన్ని తెలియజేశారు.
ప్రస్తుతం రామ్ చరణ్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.