గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. చరణ్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించినట్టేనా?

రామ్ చరణ్( Ram Charan ) శంకర్( Shankar ) కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ( Game Changer Movie ) రిలీజ్ కు సరిగ్గా మూడు వారాల సమయం ఉంది.

ఈ మధ్యకాలంలో విడుదలైన టాలీవుడ్ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన నేపథ్యంలో గేమ్ ఛేంజర్ మూవీ కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా గేమ్ ఛేంజర్ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేయగా ఈ రివ్యూ సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన సుకుమార్ ఇటీవల పుష్ప ది రూల్( Pushpa The Rule ) సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ లో సుకుమార్( Sukumar ) మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ ఫస్టాఫ్ అద్భుతంగా ఉందని ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయిందని చెప్పారు.సెకండాఫ్, క్లైమాక్స్ ఫ్యాన్స్ కు, అభిమానులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.

గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ లో రామ్ చరణ్ పర్ఫామెన్స్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్ అని ఆయన చెప్పుకొచ్చారు.సాధారణంగా సుకుమార్ ఎలాంటి కథ ప్రేక్షకులకు నచ్చుతుందో కచ్చితంగా అంచనా వేయగలరు.సుకుమార్ గేమ్ ఛేంజర్ గురించి ఈ విధంగా కామెంట్లు చేయడం ఫ్యాన్స్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోంది.

Advertisement

గేమ్ ఛేంజర్ మూవీ ఫ్యాన్స్ అంచనాలను అందుకుంటుందేమో చూడాలి.

రామ్ చరణ్ భవిష్యత్తు సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా కోసం దాదాపుగా మూడేళ్ల సమయం కేటాయించారు.కియరా అద్వానీ( Kiara Advani ) ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు.

దాదాపుగా 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.గేమ్ ఛేంజర్ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు.

బన్నీ ప్రచార యావే ప్రాణం తీసింది.. మానవ హక్కుల కమిషన్ కు బన్నీపై ఫిర్యాదు!
Advertisement

తాజా వార్తలు