రామ్ చరణ్ ను అవమానించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారా? డిజాస్టర్ మళ్లీ ఎందుకో..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ లో అతిపెద్ద డిజాస్టర్ ఆరంజ్ చిత్రం అనే విషయం అందరికీ తెలిసిందే.ఆ సినిమా చరణ్ ఎందుకు చేశాడా అంటూ ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు.

 Ram Charan Fans Angry About Orange Re Release , Ram Charan , Orange ,magadheera-TeluguStop.com

మగధీర వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత రామ్ చరణ్ నుండి ఆరంజ్ చిత్రం వచ్చింది.ఆ సినిమా వంద కోట్ల వసూళ్లు సాధించిన ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ ఆరంజ్ తో డిజాస్టర్ చవి చూడడం తో అభిమానులంతా షాక్ అయ్యారు.

రాంచరణ్ కెరియర్( Ram charan ) మళ్ళీ డౌన్ ఫాల్ అవుతుందా అని అంతా భయపడ్డారు.అలాంటి ఆరంజ్ సినిమా( Orange ) గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత ఉత్తమం అని రామ్‌ చరణ్ ఫాన్స్ భావిస్తూ ఉంటారు.

అలాంటి ఆరంజ్ సినిమాని రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేయడం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది.

మగధీర సినిమా( Magadheera ) ను రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయాలని భావించారు.కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ను కాకుండా ఆరంజ్ సినిమా ను విడుదల చేయాలని నిర్ణయించినట్లుగా అభిమానులు ఇటీవల అధికారికంగా ప్రకటించారు.ఈ నిర్ణయం ఏ మాత్రం సరి కాదని, ఇది రామ్ చరణ్ ని అవమానించడమే అవుతుందని కొందరు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల చరణ్ కి ఉన్న ఫాలోయింగ్ తగ్గుతుందని కొందరు అంటున్నారు.ఇక రామ్‌ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వం లో ఒక భారీ బడ్జెట్ సినిమా ను చేస్తున్న విషయం తెలిసిందే.

దిల్ రాజు నిర్మాణం లో ఆ సినిమా రూపొందుతోంది అతి త్వరలోనే సినిమా కు సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube