మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం హీరోగా, నిర్మాతగా బిజీగా ఉంటున్నాడు.ఇప్పటికే హీరోగా తన సత్తా ఏమిటో చూపించిన చరణ్, నిర్మాతగా ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి సినిమాలు ప్రొడ్యూస్ చేశాడు.
కాగా సోషల్ మీడియాలో చరణ్ ఎక్కువగా యాక్టివ్ లేకపోయినా ఇతర హీరోలతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులతో చాలా క్లోజ్‌గా మెదులుతాడు.
తాజాగా బ్యాడ్మింటన్ స్టార్ సానియా మిర్జా చెల్లెలి వివాహం మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కొడుకుతో జరిగిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ వేడుకలో హీరో రామ్ చరణ్ కూడా పాల్గొన్నాడు.దీంతో బాలీవుడ్ కొరియోగ్రఫర్ ఫరా ఖాన్ సానియాతో కలిసి చరణ్ డ్యాన్స్ చేశాడు.
దీనికి సంబంధించిన వీడియోను చరణ్ భార్య ఉపాసన కొణిదెల ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది.
ఈ వీడియోలో సానియా, ఫరా ఖాన్‌ల మధ్యలో చరణ్ అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్స్ వేసి అక్కడున్న వారిని అలరించాడు.
అటు సినిమాల పరంగా రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమాలో నటిస్తోన్నాడు.