ఆర్ఆర్ఆర్‌లో పోలీస్‌గా చరణ్.. ఎందుకో తెలుసా?

ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

 Ram Charan As Police In Rrr-TeluguStop.com

ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక భారీ తారాగణం నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు.

అయితే ఈ సినిమాలో చరణ్ కొంతసేపు పోలీస్ అవతారం ఎత్తుతున్నట్లు తెలుస్తోంది.దీంతో చరణ్ పోలీస్‌గా ఎందుకు మారాడనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.కాగా బ్రిటిష్ వారిని ముప్పుతిప్పలు పెట్టే సీతారామరాజు ఓ సందర్భంలో వారి కళ్లు గప్పేందుకు పోలీస్ అవతారమెత్తుతాడు.దీనికోసమే చరణ్ పోలీస్ పాత్రలో మనకు కనిపిస్తాడని తెలుస్తోంది.

తారక్ కూడా సరికొత్త లుక్‌లో కొమురం భీం పాత్రలో ఆకట్టుకోవడం ఖాయమని అంటున్నారు చిత్ర యూనిట్.ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా ఆలియా భట్, ఒలివియా మారిస్‌లు నటిస్తున్నారు.

బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ కూడా ఈ సినిమాలో పోలీస్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.అక్టోబర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube