రామ్‌ చరణ్‌ 16వ సినిమా అప్డేట్ వచ్చింది

రామ్ చరణ్ జక్కన్న సినిమా ఆర్ఆర్‌ఆర్‌ కోసం దాదాపుగా మూడు సంవత్సరాల సమయం ను కేటాయించాడు.ఆ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది.

 Ram Charan 16 Movie Under Direction Goutham Thinnanuri Shooting Update , Film N-TeluguStop.com

ఆర్ ఆర్ ఆర్‌ ఈనెల 25 వ తారీఖున విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేసేందుకు సిద్ధమయ్యాడు.

ఇప్పటికే తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు.ఆ భారీ బడ్జెట్‌ ప్రతిష్టాత్మక సినిమా కు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

రామ్‌ చరణ్ 15వ సినిమా గా శంకర్ దర్శకత్వం లో సినిమా రూపొందుతుంది.ఇదే సమయంలో చరణ్‌ 16వ సినిమా గురించిన చర్చ మొదలైంది.

Telugu Dil Raju, Ram Charan, Rc, Shankar, Tamil Shankar-Movie

ఇప్పటికే రామ్‌ చరణ్ 16వ సినిమాకు జెర్సీ చిత్ర దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.యు.వి.క్రియేషన్స్ వారు ఆర్ సి 16 సినిమాను నిర్మించబోతున్నారు.భారీ బడ్జెట్ తో ఈ సినిమా ను నిర్మిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభం ఎప్పుడు అనేది క్లారిటీ వచ్చింది.శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చరణ్‌ 15 సినిమాకు సంబంధించిన షూటింగ్ ఒక కొలిక్కి వచ్చింది.దాదాపుగా సగం వరకు షూటింగ్ పూర్తయిందని సమాచారం అందుతుంది.

జూలై లో ఆర్‌ సీ 15 సినిమా పూర్తి అవుతుందని వార్తలు వస్తున్నాయి.రామ్ చరణ్ 16వ సినిమా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం అందుతుంది.

రామ్ చరణ్ శంకర్ ల సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చింది.ఇక రామ్ చరణ్, గౌతమ్ తిన్ననూరి ల కాంబినేషన్ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

అంటే ఏడాది గ్యాప్‌ లో రామ్ చరణ్ నుండి మూడు సినిమా లు రాబోతున్నాయి అన్నమాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube