బోయపాటి శ్రీను, రామ్ పోతినేని ( Ram Pothineni )కాంబినేషన్ లో తెరకెక్కిన స్కంద మూవీ ఈ నెల 28వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం వల్ల ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
తాజాగా స్కంద మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.స్కంద మూవీకి సెన్సార్ సభ్యుల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాలో రామ్ నట విశ్వరూపం చూపించారని సమాచారం అందుతోంది.
హీరో రామ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. బోయపాటి శ్రీను( Boyapati srinu ) మార్క్ ఈ సినిమాలో ఉందని సమాచారం అందుతోంది.రామ్ శ్రీలీల ( Sreeleela )కాంబో సీన్లు, కామెడీ సీన్లు ఫస్టాఫ్ కు హైలెట్ కాగా థమన్ ( Thaman )సాంగ్స్, మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
సెకండాఫ్ లో ఎమోషనల్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయని క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ అదుర్స్ అనేలా ఉన్నాయని తెలుస్తోంది.
రామ్>( Ram Pothineni ) ను అభిమానించే అభిమనుల సంఖ్య పెరుగుతుండగా స్కంద మూవీతో బోయపాటి శ్రీను రామ్ కు కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందించడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.రామ్ బోయపాటి కాంబో మూవీ ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశం అయితే ఉంది.భారీ బడ్జెట్ తో తెరకెక్కడం ఈ సినిమాకు ప్లస్ అయిందని చెప్పవచ్చు.
ఈ సినిమా నిర్మాణం విషయంలో మేకర్స్ రాజీ పడలేదని తెలుస్తోంది.బోయపాటి శ్రీను 2021 సంవత్సరంలో అఖండ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్నారు.
అఖండ సినిమా తర్వాత బోయపాటి శ్రీను స్క్రిప్ట్ కోసం ఏడాది పాటు సమయం కేటాయించడం జరిగింది.బోయపాటి శ్రీను ఈ సినిమాకు భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం అందుతోంది.