అమెజాన్‌లో అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటున్న 'రామ్ అసుర్' మూవీ

కంటెంట్ ఉన్న సినిమాలకు ఎప్పుడూ ఆదరణ లభిస్తూనే ఉంటుంది.అది థియేటర్ అయినా, ఓటీటీ వేదిక అయినా ప్రేక్షకుల కన్ను ఖచ్చితంగా పడుతుంది.

 'ram Asur' Movie Is Getting Amazing Response On Amazon, Ram Asur , Amazon , Ott-TeluguStop.com

అలాంటి లిస్టులోనే చేరిపోయింది వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వంలో అభినవ్ సర్దార్, రామ్ కార్తిక్ నటించిన ‘రామ్ అసుర్‘ మూవీ.రీసెంట్‌గా థియేటర్స్‌లో విడుదలై సత్తా చాటిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ఓటీటీ వేదిక అమెజాన్‌లో రిలీజ్ చేశారు.

దీంతో ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది.చిత్రానికి వస్తున్న ఈ రెస్పాన్ చూసి దర్శక నిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

డైమండ్ నేపథ్యంలో పల్లెటూరి వాతావరణం ప్రతిబింబించేలా ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం దర్శకుడు వెంకటేష్ త్రిపర్ణ ప్రతిభను వెలికితీసింది.సినిమా చూస్తున్నంత సేపు సగటు ప్రేక్షకుడు థ్రిల్లింగ్‌గా ఫీల్ అయ్యేలా ఈ విలక్షణ కథాంశాన్ని ప్రేక్షకుల ముందుంచారు.

కలికాలంలో మంచి- చెడు అనే కాన్సెప్ట్ తీసుకొని ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే సన్నివేశాలతో ఎంతో ఆసక్తికరంగా మలిచిన ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మేజర్ అసెట్ అయింది.ఇకపోతే విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకుంటున్న అభినవ్ సర్దార్ ‘రామ్ అసుర్’ సినిమాతో మరో మెట్టు ఎక్కారు.

సూరి పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది.చిత్రంలో లుక్ పరంగా అట్రాక్ట్ చేసిన ఆయన టాలీవుడ్ యష్‌గా ప్రేక్షకుల నోళ్ళలో నానిపోయారు.

Telugu Sherry Agarwal, Abhinav Sardar, Amazon, Ram Asur, Ram Karthik, Tamilrasin

ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ ప‌తాకాల‌పై వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ సంయుక్తంగా నిర్మించారు.అభినవ్ సర్దార్, రామ్ కార్తీక్ హీరోలుగా నటించగా చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శెర్రి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు.శాని సాల్మాన్‌‌ ముఖ్యపాత్రలో నటించి తనదైన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు.ఈ ‘రామ్ అసూర్’ సినిమాకు థియేటర్లలో వచ్చిన రెస్పాన్స్ ఒకెత్తయితే, ఓటీటీలో కూడా అదే రేంజ్ ఆదరణ లభిస్తుండటం అనేది ఇలాంటి విలక్షణ కథలు మరిన్ని తెరకెక్కించేలా చిత్రయూనిట్‌కి మంచి బూస్టింగ్ ఇస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube