తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రకుల్ ప్రీత్ సింగ్( Rakul Preet Singh ) అనంతరం తమిళ హిందీ భాష చిత్రాలలో కూడా నటించే అవకాశాలను అందుకుని కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇలా ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగినటువంటి రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యారు సౌత్ ఇండస్ట్రీలో ఈమెకు అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటిస్తున్నప్పటికీ పెద్దగా సక్సెస్ సినిమాలను మాత్రం అందుకోలేదని చెప్పాలి.
ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమెకు నటించిన థాంక్యూ ఫర్ కమింగ్( Thank You For Coming ) అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.ఈ క్రమంలోనే రకుల్ తాను తన సినీ జర్నీ గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా ఈమె తన సినీ జర్నీ ( Cine Journey ) గురించి గుర్తు చేసుకుంటూ… పెద్ద స్క్రీన్ పై కనిపించాలని నా చిన్ననాటి కలను నిజం చేసుకోవడం కోసం నేను ప్రయత్నాలు చేశాను.ఆ సమయంలో నాకు ఇండస్ట్రీ గురించి పెద్దగా అవగాహన కూడా లేదు.
ఇండస్ట్రీలోకి రావాలన్న ఉద్దేశంతో ఎంతో నమ్మకంగా ముందడుగు వేశానని అలా మోడల్ గా, మిస్ ఇండియాగా చివరికి నటిగా అవకాశాలు అందుకున్నానని ఈమె తెలియజేశారు అయితే సినిమా అవకాశాల కోసం ముంబై ( Mumbai ) వచ్చిన మొదట్లో ఎన్నో ఇబ్బందులు పడ్డానని ఈమె తెలియజేశారు.ముంబై వెళ్లి అక్కడ ఒంటరిగా ఉండడం చాలా కష్టంగా అనిపించింది.ఎన్నో ఆడిషన్స్ సెలక్షన్ అయినప్పటికీ సినిమా అవకాశాలు( Movie Offers ) మాత్రం రాలేదని తెలిపారు.ఇలా ఎన్నో అవకాశాలు వచ్చి వాటిని మిస్ చేసుకోవడం మీ హృదయాలలో స్థానం సంపాదించుకున్నాను అంటూ ఈమె తెలియజేశారు.
ఈ ప్రయాణంలో నేను నమ్ముకున్నది.ఆత్మవిశ్వాసం, కష్టపడి పని చేయడం.
అవే నేడు నా కలలను నిజం చేశాయి అంటూ తన సినీ జర్నీ గురించి రకుల్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.