అధికారంలోకి వచ్చి ప్రజలకు తలైవా సేవ చేయడమే నా చివరి కోరిక !!!

కండక్టర్ నుండి సూపర్ స్టార్ స్థాయికి ఎదిగిన రజినీకాంత్ ఎంతోమందికి ఆదర్శం.ఆయనకు ఇండియాలోనే కాక జపాన్,చైనా, మలేషియా వంటి దేశాలలో కూడా వీరాభిమానులు ఉన్నారు.

అయితే తాజాగా మదురైకి చెందిన రజిని వీరాభిమాని మురళి కరోనా,కిడ్నీ సమస్యల కారణంగా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.ప్రస్తుతం అతని పరిస్థితి సీరియస్ గా ఉండడంతో అతన్ని ఐసీయూకు షిఫ్ట్ చేసి హాస్పిటల్ వారు చికిత్స అందిస్తున్నారు.

Rajinikanth Should Become CM That's My Last Wish, Tamilnadu, Rajinikanth Fan,Las

ఇలాంటి టైంలో మురళి 2021 లో తమిళనాడు రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలలో రజినీకాంత్ గెలిచి అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని అదే తన చివరి కోరిక అని ఓ వీడియో లో చెప్పాడు.ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది దీన్ని చూసిన రజినీకాంత్ మురళి! నేను రజనీకాంత్‌ ను మాట్లాడుతున్నాను.

నువ్వు నీ సమస్య నుండి కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా.నువ్వు త్వరగా కోలుకుని ఇంటికి తిరిగి వెళతావు!తర్వాత నీ కుటుంబసభ్యులతో కలిసి నా ఇంటికి వచ్చి నన్ను కలుసుకో!.

Advertisement

ధైర్యంగా ఉండు! శుభాకాంక్షలు! అంటూ ట్వీట్ చేశారు.

దానిమ్మ ర‌సంలో ఇవి క‌లిపి సేవిస్తే..ఆ జ‌బ్బులు మాయం!
Advertisement

తాజా వార్తలు