జైలర్ ఎఫెక్ట్‌.. ఆ సినిమాకి తెలుగులో మార్కెట్‌ డబుల్‌!

సూపర్ స్టార్ రజినీకాంత్‌( Rajinikanth )జైలర్ సినిమా తో ఏకంగా రూ.500 కోట్ల వసూళ్లను దక్కించుకున్నాడు.

రికార్డ్‌ స్థాయి వసూళ్లు సొంతం చేసుకున్న రజినీకాంత్ తదుపరి సినిమాను జ్ఞానవేల్‌ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే.

ఆ సినిమాకు సంబంధించిన విషయాలు మరియు ఆ సినిమా పోస్టర్స్ తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.రోబో సినిమా తర్వాత రజినీకాంత్‌ నటించిన ఏ ఒక్క సినిమా కూడా తెలుగు లో సరిగ్గా ఆడలేదు.

దాంతో జైలర్‌ ( Jailar movie )వరకు కూడా అన్ని సినిమా లకు మార్కెట్‌ డౌన్ అవుతూ వచ్చింది.

జైలర్‌ సినిమా ( Jailar movie )ను మొదట చాలా మంది నిర్మాతలు తిరస్కరించారు.అయినా కూడా తమిళ్‌ నిర్మాతలు పట్టుబట్టి విడుదల చేశారు.తక్కువ రేటుకు బయ్యర్లు కొనుగోలు చేసి మంచి లాభాలను సొంతం చేసుకున్నారు.

Advertisement

జైలర్‌( Jailar movie ) మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యం లో రజనీకాంత్‌ 170వ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అందుకే ఆ సినిమా ని దాదాపు రెట్టింపు రేటుకు కొనుగోలు చేసేందుకు గాను బయ్యర్లు సిద్ధం అయ్యారు.

జైలర్‌ సినిమా ను కొనుగోలు చేసిన వారే ఇప్పుడు ఈ సినిమా ను కూడా పెద్ద మొత్తం లో కొనుగోలు చేసేందుకు గాను సిద్ధంగా ఉన్నారట.తెలుగు లో రజనీకాంత్ సినిమా కు చాలా సంవత్సరాల తర్వాత ఈ రేంజ్ మార్కెట్ ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ముందు ముందు కూడా రజినీకాంత్లాల్ సలామ్( Lal Salaam ) అనే సినిమా తో కూడా రాబోతున్నాడు.

ఆ సినిమా కి కూడా తెలుగు లో మంచి మార్కెట్ ఉండే అవకాశాలు ఉన్నాయి.

రూ.10 లక్షల విరాళం ప్రకటించినా రష్మికపై ట్రోల్స్.. అలా చేయడమే తప్పైందా?
Advertisement

తాజా వార్తలు