సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులలో సీనియర్ నరేష్( Actor Naresh ) ఒకరు.ఈయన చేస్తున్న సినిమాలు ప్రస్తుతం మంచి సక్సెస్ లను అందుకుంటున్నాయి.
అలాగే నటుడి గా కూడా ఆయన రోజురోజుకీ ఒక్కో మెట్టు పైకెక్కుతున్నాడనే చెప్పాలి.నరేష్ నిజ జీవితంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ చాలాసార్లు వార్తల్లో నిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇక ఇలాంటి క్రమంలో నరేష్ ని సినిమాలలో కూడా తీసుకోరు అని చాలామంది అనుకున్నారు.కానీ నరేష్ లోని నటన తనకి చాలావరకు ప్లస్ అయిందనే చెప్పాలి.
రీసెంట్ గా సామజవరగమన( Samajavaragamana ) అనే సినిమాలో హీరో ఫాదర్ గా నటించిన నరేష్ తన కామెడీ టైమింగ్ తో అద్భుతమైన నవ్వుల్ని పోయించాడు.నరేష్ ని ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా కావాలని మరీ తన సినిమాల్లో పెట్టుకోవడం జరుగుతుంది.ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు నరేష్ కి, రాజేంద్రప్రసాద్ కి మధ్య సినిమాల పరంగా చాలా పోటీ ఉండేదని చాలా మంది చెప్తూ ఉంటారు.రాజేంద్రప్రసాద్( Rajendra Prasad ) వంశీ గారి డైరెక్షన్ లో ఎక్కువగా సినిమాలు చేసేవాడు అలాగే నరేష్ జంధ్యాల డైరెక్షన్ లో ఎక్కువ సినిమాలు చేసేవాడు.
ఇక రెండు సినిమాలు కూడా కామెడీ ప్రధానం గా వచ్చినవే కాబట్టి వీళ్ల సినిమాలకు ఎప్పుడు పోటీ ఉండేదని అప్పట్లో చాలామంది చెప్తూ ఉంటారు.
ఒకప్పుడు కామెడీ సినిమాలు( Comedy Movies ) చేయాలంటే వీళ్లిద్దరు మాత్రమే చేసే వాళ్ళు కామెడీతో మంచి గుర్తింపుని సంపాదించుకొని ఇండస్ట్రీలో చాలా కాలం పాటు వీళ్ళిద్దరూ హీరోలుగా కొనసాగారు.ఇక ముఖ్యంగా వీళ్ళు లేడీ గెటప్ ( Lady Getups )లో చేసిన సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.కామెడీని పండించడానికి ఎన్ని రకాల క్యారెక్టర్లు చేయాలో వీళ్ళిద్దరూ అన్ని రకాల క్యారెక్టర్స్ ని అప్పట్లో చేసి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.
అయితే ఇలాంటి హీరోలు ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో ఎవరు లేరు అనేది ఇండస్ట్రీ లో చాలా స్పష్టం గా కనిపిస్తుంది.అంటే మాస్ సినిమాలు కమర్షియల్ సినిమాలు చేసే హీరోలను రీప్లేస్ చేస్తూ చాలామంది హీరోలు వచ్చారు గాని, వీళ్ళ లాగా కన్సిస్టెన్సీగా కామెడీని పండించే నటులు మాత్రం ఇండస్ట్రీలో ఇంకా ఎవరు రాలేదనేది అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం అనే చెప్పాలి…