బుల్లితెర నటి చారు అసోపా, రాజీవ్ సేన్( Asopa, Rajeev Sen ) ఇటీవలే విడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే.గత ఏడాది ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించారు.
ఇక అప్పటినుంచి ఈ జంట విడివిడిగానే ఉంటున్నారు.ఇటీవల జూన్ 8న ఈ జంట అధికారికంగా విడాకులు తీసుకుని విడిపోయారు.
జూన్ 8న అధికారికంగా విడాకులు మంజూరు అయినట్లు తెలిపారు.ఈ క్రమంలో తాను చేసింది సరైన పనే అని చారు అభిప్రాయపడుతుండగా రాజీవ్ మాత్రం బాధలో కూరుకుపోయినట్లు కనిపిస్తున్నాడు.
మొన్నటికి మొన్న విడాకులు( Divorce ) తీసుకుంటున్న సమయంలో ఒక ఎమోషనల్ పోస్ట్ ని చేశాడు రాజీవ్ సేన్.

కాగా భార్యకు విడాకులు ఇచ్చి కనీసం వారం రోజులు కూడా కాకముందే మళ్లీ కలిస్తే బాగుండని ఆశపడుతున్నాడు రాజీవ్.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజీవ్ సేన్.ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.
మేమిద్దరం కలిసి ఉండనంత మాత్రాన నా కూతురి మీదున్న ప్రేమ తగ్గదు.నా బిడ్డ విషయంలో మేమిద్దరం ఒకరికి ఒకరం మద్దతుగా ఉంటాము.
ఒక తండ్రిగా నా కూతురికి నేను ఎక్కువ సమయాన్ని కేటాయించాలి అనుకుంటున్నాను.నేనెప్పుడూ చారు క్షేమాన్నే కోరుకుంటాను.
తనకు ఎప్పుడూ అండగా ఉంటాను.తనపై నా ప్రేమ అలాగే ఉంటుంది.

ఏదో ఒక రోజు మేము మళ్లీ కలుస్తామని ఆశిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు రాజీవ్ సేన్.ఇంటర్వ్యూ లో రాజీవ్ సేన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.కాగా చారు అసోపా, రాజీవ్ సేన్ 2019 జూన్ 9న పెళ్లి చేసుకున్నారు.వీరి దాంపత్యానికి గుర్తుగా 2021లో పాప పుట్టింది.ఆ పాపకు జియానా అని పేరు కూడా పెట్టారు.అయితే ఈ జంట భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ పాపకు తల్లిదండ్రులుగా మాత్రం ఉంటామని చెప్తున్నారు.