ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయను రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..!!

గోష్ మహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన రాజాసింగ్ ( Raja Singh )సంచలన వ్యాఖ్యలు చేశారు.డిసెంబర్ 9వ తారీఖున అసెంబ్లీ సమావేశాలు నేపథ్యంలో ఎన్నికలలో విజయం సాధించిన వారందరిని ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయించే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది.

 Rajasingh Sensational Comments That He Will Not Take Oath As An , Mla Rajasingh,-TeluguStop.com

ఈ క్రమంలో తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనని రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.దీనికి కారణం ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం అక్బరుద్దీన్( MIM Akbaruddin ) ఓవైసీ ఉండటమేనని అన్నారు.

ఆయన ప్రొటెం స్పీకర్ గా ఉంటే తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని తేల్చి చెప్పడం జరిగింది.

ఈ సమయంలో అసెంబ్లీ సమావేశాలకు( assembly meetings ) కూడా హాజరుకాబోమని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.అక్బరుద్దీన్ కంటే అసెంబ్లీలో ఎందరో సీనియర్లు ఉన్నారు.గతంలో బీఆర్ఎస్ కూడా ఇలానే చేసింది.

అని మండిపడ్డారు.రెగ్యులర్ స్పీకర్ వచ్చేవరకు ప్రమాణ స్వీకారం చేయమని వీడియో సందేశం విడుదల చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిసారి రేపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి.పైగా రేపు సోనియా గాంధీ( Sonia Gandhi ) పుట్టిన రోజు కావడంతో.

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రసంగం పై ఆసక్తి నెలకొంది.ఈ క్రమంలో గెలిచిన 119 ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించాలని.

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.అయితే ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీనీ నియమించటంతో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.

ప్రమాణ స్వీకారం చేయబోనాన్ని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube