తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్ దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో సతీమణి జీవిత రాజశేఖర్, కుమార్తెలు శివాని, శివాత్నికలతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనాంతరం ఆలయం వెలుపల జీవిత రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.కరోనాతో రాజశేఖర్ ఆరోగ్య పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.
ఆయన ఆరోగ్యం కుదుటపడితే మెట్ల మార్గం గుండా నడిచి శ్రీవారిని దర్శించుకుంటాం అని మొక్కుకున్నట్లు చెప్పారు.స్వామి వారి దయతో ఆరోగ్యం కుదుటపడి కోరిక నెరవేరడంతో మొక్కులు చెల్లించుకున్నామని పేర్కొన్నారు.