వాళ్లు 11 అడిగితే.. వీళ్లు 6 అంటున్నారు..!

సూపర్ స్టార్ రజినికాంత్( Rajinikanth ) తెలుగు మార్కెట్ చాలా దెబ్బ తిన్నది.కబాలి తర్వాత నుంచి రజినీ సినిమాలు ఇక్కడ అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు.

భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు అన్నీ కూడా వర్క్ అవుట్ అవకపోవడంతో రజినీ సినిమా అంటే తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ ఆలోచించే పరిస్థితికి వచ్చారు.ఈ క్రమంలో రజిని లేటెస్ట్ మూవీ జైలర్( Jailer ) కి కూడా ఈ సమస్య వెంటాడుతుందని తెలుస్తుంది.

తెలుగులో ఒకప్పుడు తన డబ్బింగ్ సినిమాలతోనే పాతిక కోట్ల దాకా బిజినెస్ చేసిన రజిని ఇప్పుడు 11 కోట్లు కోట్ చేస్తున్నా ఎవరు ముందు రావట్లేదని తెలుస్తుంది.

Rajanikanth Jailer Business Doesnot Closed In Telugu States , Nelson Dilip Kumar

జైలర్ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ ( Nelson Dilip Kumar )డైరెక్ట్ చేశారు.సినిమాలో రజిని తన మార్క్ స్టైలిష్ లుక్ తో కనిపిస్తున్నారు.ఈ సినిమాను తెలుగులో 11 నుంచి 15 కోట్ల దాకా రైట్స్ అమ్మాలని తమిళ నిర్మాతలు అనుకోగా తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం 5 లేదా 6 కోట్ల కంటే ఎక్కువ పెట్టే పరిస్థితి లేదని చెబుతున్నారట.

Advertisement
Rajanikanth Jailer Business Doesnot Closed In Telugu States , Nelson Dilip Kumar

ఒకప్పుడు తెలుగులో మన స్టార్స్ కి సమానంగా రజిని సినిమాల బిజినెస్ ఉండేది.కానీ వరుస సినిమాల ఫ్లాపుల వల్ల రజిని తెలుగు మార్కెట్ దెబ్బ తిన్నది.

మరి జైలర్ తో అయినా సూపర్ స్టార్ హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.

Advertisement

తాజా వార్తలు