దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్‌తో యమ బిజీగా ఉన్నాడు.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.కాగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ తరువాత ఎవరితో చేతులు కలుపుతాడా అనే అంశం అప్పుడే ఇండస్ట్రీ వర్గాల్లో తెగ హల్‌చల్ చేస్తోంది.
బాహుబలి సినిమాతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌తో మరోసారి చేతులు కలిపేందుకు రాజమౌళి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ప్రభాస్ ‘జాన్’ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.
ఈ సినిమా తరువాత మరో సినిమాను లైన్‌లో పెట్టిన ప్రభాస్, రాజమౌళితో కలిసి ఓ ప్రొడక్షన్ హౌజ్‌ను ప్రారంభించనున్నాడట.ఇందులో భాగంగా తొలి సినిమాను వారిద్దరు కలిసి చేయనున్నట్లు ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూలో చేప్పాడట ప్రభాస్.
ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది.ఈ వార్త గనక నిజం అయితే బాహుబలి రికార్డులకు ఎసరు పెట్టడం ఖాయమని అంటున్నారు సినీ విశ్లేషకులు.
కాగా ఈ సినిమాపై అటు ప్రభాస్, ఇటు రాజమౌళి స్పందించాల్సి ఉంది.ఇక వీరిద్దరు తమ ప్రాజెక్టులు పూర్తి చేసే సరికి 2021 పూర్తవుతుంది.
మరి ఈ కాంబో సెట్ అయితే వీరి సినిమా వచ్చేది 2021 తరువాతే అనేది నిజం.







