టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ శాతం పూర్తి చేసుకుంది.
అయితే లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.
దాదాపు రెండు నెలల తరువాత టాలీవుడ్ షూటింగ్‌లకు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్‌ను కూడా మొదలుపెట్టాలని జక్కన్న ప్లాన్ చేశాడు.అయితే కరోనా వైరస్ ప్రస్తుతం తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటం, ఇండస్ట్రీకి చెందినవారికి కూడా కరోనా పాజిటివ్ రావడంతో ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనలేమని చిత్ర హీరోలు రాజమౌళికి చెప్పినట్లు తెలుస్తోంది.
దీంతో జక్కన్న తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడట.ప్రస్తుతానికి షూటింగ్‌ను వాయిదా వేసిన జక్కన్న హీరోలకు అదిరిపోయే ట్విస్టు ఇచ్చాడట.
జూన్ చివరి వారంలో షూటింగ్ మొదలుపెట్టాలని అనుకున్నా, ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా అది వాయిదా పడింది.దీంతో జూలై మొదటి వారంలో ఏది ఏమైనా షూటింగ్ మొదలుపెడతానని, హీరోలు ఖచ్చితంగా పాల్గొనాలని ఆయన ఆర్డర్ వేశాడట.
ఈ మేరకు హీరోలకు చిన్న క్లాస్ కూడా పీకాడట దర్శకుడు.మొత్తానికి ఆర్ఆర్ఆర్ హీరోలు సినిమా షూటింగ్‌కు హ్యాండివ్వడంతో వారికి దిమ్మతిరిగే రీతిలో జక్కన్న ప్లాన్ చేయడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.