ఆస్కార్‌ ఖర్చు రూ.8 కోట్లు... జనాలు మరీ అంత అమాయకులు కారు కార్తికేయ

Rajamouli Son Karthikeya Comments About Oscar Award Budget , Rajamouli, Karthikeya, Oscar Award, RRR, Natu Natu Song, Flim News

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి( Rajamouli ) దర్శకత్వం లో రూపొందిన ఆర్ఆర్ఆర్‌( RRR ) సినిమా లోని నాటు నాటు పాట కి ఆస్కార్ అవార్డు రావడం ప్రతి ఒక్క ఇండియన్ సినీ ప్రేమికుడికి సంతోషాన్ని కలిగించే విషయం అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఆ మధ్య ఒక తెలుగు ఫిలిం మేకర్స్ మీడియా ముందు మాట్లాడుతూ రాజమౌళి ఆస్కార్ కోసం ఏకంగా 80 కోట్ల రూపాయలను ఖర్చు చేశాడని.

 Rajamouli Son Karthikeya Comments About Oscar Award Budget , Rajamouli, Karthik-TeluguStop.com

ఆ 80 కోట్ల రూపాయలు నాకిస్తే పది సినిమాలు తీసి మొహాన కొడతాను అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ఆ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారాన్ని రేపాయి.

మన సినిమా కి ఆస్కార్‌ వస్తున్నది అనే ఆనందం లేకుండా ఇలా విమర్శలు చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ చాలా మంది ఆయన్ని తప్పుపట్టారు.తాజాగా రాజమౌళి తనయుడు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Telugu Karthikeya, Naatu Naatu, Oscar, Rajamouli Son, Rrr-Movie

ఆస్కార్ జర్నీలో కార్తికేయ( Karthikeya ) పాత్ర అత్యంత కీలకమైనది.ప్రమోషన్ విషయాలు మొదలుకొని అన్ని విషయాల్లో కూడా కార్తికేయ ముందుండి నడిపించాడు.ఆస్కార్ ప్రమోషన్ కోసం ఎంత ఖర్చు పెట్టారు అనేది ఆయనకు అన్నీ తెలుసు.ఆయన తాజాగా 80 కోట్ల రూపాయలను ఈ సినిమా ఆస్కార్ ప్రమోషన్ కోసం ఖర్చు చేసినట్లుగా జరుగుతున్న ప్రచారం నిజం కాదని పేర్కొన్నాడు.

రెండు దఫాల్లో కలిపి కేవలం ఎనిమిది కోట్ల రూపాయలను మాత్రమే ఆస్కార్ ప్రమోషన్ కోసం ఖర్చు చేసినట్లుగా కార్తికేయ తెలియజేశాడు.ఇప్పటి వరకు మీడియా మరియు కొందరు అనుకుంటున్నట్లుగా 80 కోట్ల రూపాయలు ఆస్కార్కు ఖర్చు చేయలేదని కేవలం 8 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు జరిగిందని ఆయన క్లారిటీ ఇచ్చాడు.

కానీ కార్తికేయ మాటలను నమ్మాలనిపించడం లేదని కొందరు సినిమా ప్రియులు అభిప్రాయం చేస్తున్నారు.రాజమౌళి రూ.100 కోట్లు ఖర్చు చేసిన తప్పేం లేదు.ఆస్కార్ అనేది ఒక గొప్ప అవార్డు.

అలాంటి అవార్డు మన ఇండియన్ సినిమాకి రావడం చాలా గొప్ప విషయం.కనుక రూ.8 కోట్లు కాకుండా 80 కోట్లు ఖర్చు చేసినా కూడా రాజమౌళి గొప్ప దర్శకుడే.నాటు నాటు పాట ఒక అద్భుతం అనడంలో సందేహం లేదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube