ఎట్టకేలకు కొట్టుకుంటున్న టాప్ డైరెక్టర్లు

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్‌‌ను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు.ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్‌పై కన్నేశాడు రాజమౌళి.

 Rajamouli Shankar To Have Aclash At Box Office-TeluguStop.com

ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమా రిలీజ్‌ను జనవరికి వాయిదా వేశారు చిత్ర యూనిట్.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రమా్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు.

కాగా అదే సమయానికి మరో ప్రెస్టీజియస్ మూవీ కూడా రిలీజ్‌కు రెడీ అవుతోంది.

సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఇండియన్-2 కూడా జనవరిలో రిలీజ్‌కు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.భారతీయుడు చిత్రం గతంలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

దీంతో ఈ సీక్వెల్‌ చిత్రంపై కూడా అంతేస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

బాహుబలితో ఇండియన్ సినిమాలో తన మార్క్ వేసిన రాజమౌళి, పలు బ్లాక్‌బస్టర్ మూవీలను అందించిన శంకర్ జనవరిలో బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు రెడీ అవుతున్నారు.

మరి ఈ టాప్ డైరెక్టర్లలో ఎవరు విజయం సాధిస్తారా అనే అంశం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube