వెయ్యి కోట్లు ఖర్చు చేసినా దక్కని గౌరవం 'ఆర్‌ఆర్‌ఆర్‌' కి..!

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి(Rajamouli) దర్శకత్వం లో రూపొంది ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో సందడి చేస్తున్న ఆర్ఆర్ఆర్‌ చిత్రం పై కొందరు చేస్తున్న విమర్శలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.ఈ సినిమా ఆస్కార్ అవార్డు ప్రచారం కోసం రాజమౌళి 80 కోట్ల రూపాయలను ఖర్చు చేశాడంటూ తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు సర్వత్ర విమర్శలకు తెర లేపిన విషయం తెల్సిందే.

 Rajamouli Is Supported By Film Lovers ,rajamouli , Rrr , Oscar Award  , Ntr , Ra-TeluguStop.com

రాజమౌళి ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా అందులో పరమార్థం ఉంటుంది.రూ.80 కోట్లు ఖర్చు చేసినంత మాత్రాన ఆ డబ్బు బూడిదల్లో పోసిన పన్నీరు అవ్వదు.ప్రతి రూపాయకు వంద రూపాయల ప్రతిఫలం ఉంటుంది.

ఆ విషయం ఆయన సినిమాలను చూస్తేనే అర్థమవుతుంది.అలాంటిది రాజమౌళి గురించి తమ్మారెడ్డి భరద్వాజ(Bharadwaja Thammareddy) చేసిన వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు.

ఇతర ఫిల్మ్‌ మేకర్స్ 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా కూడా ప్రస్తుతం మన ఆర్ఆర్ఆర్ సినిమా కు దక్కుతున్న గౌరవం దక్కదు.అలాంటి గౌరవం దక్కడం తెలుగు సినిమా పరిశ్రమకే కాకుండా యావత్ దేశ సినీ పరిశ్రమకు గర్వకారణం.ప్రపంచం మొత్తం తెలుగు సినిమా గురించి మాట్లాడుకునే విధంగా రాజమౌళి టీం చేశారు.వారిని అభినందించకున్నా పరవాలేదు కానీ లెక్కలు తీసి విమర్శించడం కరెక్ట్ కాదు అని సగటు సినీ ప్రేమికుడు విమర్శలు చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అద్భుతమైన కథనాలతో రాజమౌళి సినిమాలను చేయగలడు.అలాంటి సినిమాలకు ఆస్కార్ అవార్డు(oscar award ) రావాల్సిన అవసరం ఉంది.అందుకోసం ఖర్చు తప్పనిసరి, ఆ ఖర్చు అనేది ఒక రాజమౌళి చేస్తున్నది మాత్రమే కాదు.ఆస్కార్ కోసం ప్రయత్నించే ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన ఖర్చు.పబ్లిసిటీ చేయకుండా ఏ ఒక్కటి కూడా దక్కదు.కనుక రాజమౌళి రూ.80 కోట్లు కాదు రూ.100 కోట్లు రూ.200 కోట్లు ఖర్చు చేసిన కూడా అభ్యంతరం లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube