టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు,( Mahesh Babu ) దర్శకదీరుడు ఎస్.ఎస్.రాజమౌళి( SS Rajamouli ) కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఆ ప్రాజెక్టు పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఆ సినిమా ఇంకా మొదలుపెట్టకు ముందే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అవడం ఖాయం అని చెప్పేసారు మహేష్ అభిమానులు.అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు దర్శకుడు రాజమౌళి.
మరి ఈ సినిమా విషయంలో ఏ చిన్న బజ్ వచ్చినా సెన్సేషన్ గా మారుతుండగా ఇపుడు ఈ చిత్రంపై స్వయంగా జక్కన్న రాజమౌళినే క్రేజీ అప్డేట్ అందించారు.
జపాన్ లో( Japan ) తన లాస్ట్ గ్లోబల్ హిట్ చిత్రం రౌద్రం రణం రుధిరం.( RRR ) ఈ స్క్రీనింగ్ కి హాజరైన తాను ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమా తాలూకా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యింది అని అలాగే అది ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉందని ఇక సినిమా క్యాస్టింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు కేవలం హీరో ఒక్కరే లాక్ అయ్యారు.
అతడే మహేష్ బాబు అంటూ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇచ్చారు.
అంతే కాకుండా ఈ సినిమా హీరో మహేష్ బాబు చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు మీలో చాలా మందికే తెలిసే ఉండొచ్చు.సాధ్యమైనంత వరకు ఈ చిత్రాన్ని త్వరగా కంప్లీట్ చేసి ఇక్కడ కూడా రిలీజ్ చేస్తామని జక్కన్న సూపర్ అప్డేట్స్ అయితే సూపర్ ఫ్యాన్స్ కి అందించారు.దీనితో ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
తాజాగా జక్కన్న చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మహేష్ అభిమానులు ఆ కామెంట్లను తెగ వైరల్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.