టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి( SS Rajamouli ) ఒకరు.ఈయన పేరు ప్రఖ్యాతలు అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాయని చెప్పాలి.
అయితే ఈయన కెరియర్ మాత్రం బుల్లితెర సీరియల్స్ తో ప్రారంభమైందని చెప్పాలి.బుల్లితెర సీరియల్స్ కు దర్శకుడిగా వ్యవహరిస్తున్నటువంటి రాజమౌళి అనంతరం ఎన్టీఆర్ హీరోగా నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమయ్యారు.
అయితే మొదటి సినిమాతోనే దర్శకుడుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయనకు తదుపరి సినిమా అవకాశాలు వచ్చాయి.అయితే ఇప్పటివరకు రాజమౌళి చేసిన ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను నిరాశ పరచలేదు, నిర్మాతలకు నష్టాలను తీసుకురాలేదు.టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మొదటి పాన్ ఇండియా సినిమాగా బాహుబలి( Bahubali ) చిత్రాన్ని పరిచయం చేసిన దర్శకుడు రాజమౌళి అంతే కాకుండా ఇటీవల ఈయన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన RRR సినిమా ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో మంచి సక్సెస్ అందుకొని ఆస్కార్ అవార్డును( Oscar Award ) కూడా సొంతం చేసుకుంది.
ఈ విధంగా రాజమౌళి సినిమా అంటేనే అంతర్జాతీయ స్థాయిలో అంచనాలు పెరిగిపోతున్నాయని చెప్పాలి.ఇక రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు( Mahesh Babu ) తో సినిమా చేయబోతున్నారు.ప్రస్తుతం ఈ సినిమా పనులలో రాజమౌళి ఎంతో బిజీగా గడుపుతున్నారు.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయి.ఇక ఇటీవల రాజమౌళికి సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సాధారణంగా రాజమౌళి ఏదైనా వేడుకకు వెళ్ళిన అక్కడ జరిగే కార్యక్రమం గురించి మాట్లాడుతూ ఉంటారు.
ఇకపోతే తాజాగా తన భార్య రమా( Rama ) తో కలిసి రాజమౌళి ఓ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన అందమైన ప్రేమ రాణి అంటూ సాగిపోయే పాటకు డాన్స్ చేస్తూ సందడి చేశారు.ప్రస్తుతం ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.కమల్ హాసన్ మీలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ కొందరు కామెంట్లు చేయగా నేను చూస్తున్నది నిజమేనా అంటూ మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.ఇలా రాజమౌళి డాన్స్( Rajamouli Dance ) చేయడం చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవ్వడమే కాకుండా ఈ వీడియోని మరింత వైరల్ చేస్తున్నారు.