ఇటీవలే తనపై విధించిన సస్పెన్షన్ ను బిజెపి ( BJP )అధిష్టానం ఎత్తి వేయడంతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్( MLA Raja Singh ) యాక్టివ్ అయ్యారు.బిజెపి అగ్ర నేతల మెప్పు పొందే ప్రయత్నాలు చేస్తున్నారు.
అలాగే బిజెపి ప్రత్యర్థులైన కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలను టార్గెట్ చేసుకుని రాజాసింగ్ విమర్శలతో విరుచుకుపడుతున్నారు .ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలు కావడంతో రాజాసింగ్ స్పీడ్ పెంచారు.బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ తో పాటు , కాంగ్రెస్ అగ్రనేతలను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు.అలాగే కొన్ని ప్రధాన సామాజిక వర్గాలను ఆకట్టుకునే విధంగా బిఆర్ఎస్ కాంగ్రెస్ లపై జనాలలోను వ్యతిరేకత పెంచే విధంగా అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు .దీనిలో భాగంగానే… కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi )కి బిజెపి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తాను అని చెప్పే దమ్ము రాహుల్ గాంధీకి ఉందా అని రాజాసింగ్ ప్రశ్నించారు .అలాగే బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆ దమ్ముందా అని రాజా సింగ్ ప్రశ్నించారు.బీసీలపై ప్రేమ వలక పోస్తున్న కెసిఆర్, కేటీఆర్(CM KCR KTR ) లు బీసీని సీఎం చేస్తానని ఎందుకు ప్రకటించలేకపోతున్నారని రాజాసింగ్ ప్రశ్నించారు.
కనీసం కెసిఆర్ కుటుంబ సభ్యులు సీఎం పదవి చేపట్టబోమని చెప్పి, ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో అర్హులైన నాయకులను సీఎం ను చేస్తామని ప్రకటించే సత్తా ఉందా అని రాజాసింగ్ ప్రశ్నించారు.సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఓబీసీ నేతను బిజెపి ప్రధాని చేసిందని, మైనారిటీ దళిత గిరిజన నేతలను రాష్ట్రపతులను చేసిన చరిత్ర బిజెపికి ఉందని రాజాసింగ్ చెప్పుకొచ్చారు.అయితే రాజాసింగ్ ( MLA Raja Singh ) వ్యాఖ్యలపై టిఆర్ఎస్ కాంగ్రెస్( TRS Congress ) శ్రేణులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ బిజెపి విధానాలను ప్రశ్నిస్తూ కౌంటర్లు ఇస్తున్నారు.