భారతదేశపు అతిపెద్ద హోమ్-గ్రోన్ వీడియో ప్రసార ప్లాట్ఫార్మ్ అయిన జీ5, కొన్ని రోజుల క్రితం తమ తాజా తెలుగు ఒరిజినల్ ‘అహ నా పెల్లంట’ విడుదలను ప్రకటించింది.
అప్పటి నుండి, సీరీస్ మరియు నటీనటుల గురించి చాలా సందడిగా ఉంది.
షోల విడుదల దగ్గర పడుతుండటముతో, ముఖ్యపాత్రదారులు రాజ్ తరుణ్ మరియు శివాని రాజశేఖర్ శుక్రవారం నాడు సీరీస్ ప్రచారము కొరకు విశాఖపట్నం లోని దాది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజి, విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజి మరియు సిఎంఆర్ సెంట్రల్ మాల్ లలో కనిపించారు.వీరు ప్రచారాలను కొనసాగించారు మరియు ఈరోజు విజయవాడ కనకదుర్గ ఆశీస్సులు తీసుకున్నారు.
ఇద్దరు గేట్వే హోటల్ లో ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు, దీని తరువాత వివిఐటి కాలేజ్ మరియు పివిపి స్వ్కేర్ మాల్ సందర్శించారు.ఈ సీరీస్ తమ పెళ్ళినాడు వధువు ద్వారా ఒంటరివాడైన ఒక వరుడి హాస్యభరిత కథ.సంజీవ రెడ్డి దర్శకత్వం వహించి, తమడ మీడియా ద్వారా నిర్మించబడిన ఈ ఎనిమిది ఎపిసోడ్స్ సీరీస్ ‘అహ నా పెళ్ళంట’ లో రాజ్ తరుణ్ మరియు శివాని రజశేఖర్ మరియు ఇతర హాస్యనటీనటులు నటించారు.ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా సీరీస్ నవంబరు 17 నుండి ZEE5 పై ప్రీమియర్ గా ప్రసారం అవుతుంది.
ప్రేమ, ద్రోహం, స్నేహం వంటి అనేక భావావేశాలు నిండిన ఈ సీరీస్ వరుడిని మండపములో ఒంటరిగా వదిలి తన మాజీ ప్రియుడితో పారిపోయిన ఒక వధువు కథ.ఈ వరుడు ప్రతీకారము తీర్చుకోవాలని నిర్ణయించుకోవడముతో కథ ముందుకు సాగుతుంది.ఈ సీరీస్ ప్రతీకారము మరియు తన తలరాతను శాశ్వతంగా మార్చివేసే ఒక కారణంలేని ప్రమాణముపై తీయబడిన ఒక హాస్యభరితమైన చిత్రీకరణ.
శృంగారం మరియు హాస్యాల సమ్మేళనమైన అహ నా పెళ్ళంట బంధాలకు గురించి కొత్తగా ఆవిష్కరించింది.ఇది ప్రేక్షకులకు ఒకటి కాదు, అనేక ఆశ్చర్యాలకు గురిచేస్తుంది.మనీష్ కల్రా, చీఫ్ బిజినెస్ అధికారి, ZEE5 ఇండియా ఇలా అన్నారు, “అహ నా పెళ్ళంట’ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఒక ఆధునిక ప్రేమ కథ.భారతదేశపు బహుభాషా కథకుడిగా, విభిన్న కథనాల కొరకు కథకులతో భాగస్వామ్యము ద్వారా వినోదముపై దృష్టి కేంద్రీకరించుటకు మేము గర్విస్తున్నాము మరియు ఈ తెలుగు సీరీస్ ఆ దిశలో మరొక అడుగు.ప్రముఖ నటీనటులతో ఈ సీరీస్ కొద్దిగా హాస్యాన్ని జోడించి క్లిష్టమైన సంబంధాల గురించి అందంగా చెప్తుంది.
” దర్శకుడు సంజీవరెడ్డి ఇలా అన్నారు, “’అహ నా పెళ్ళంట’ ప్రేక్షకులకు వినోదాన్ని పంచే ఒక కథ మరియు సీరీస్ ముగిసే సమయానికి వారి ముఖములో చిరునవ్వు మిగులుస్తుంది.ఈ ప్రాజెక్ట్ కోసం మేము చాలా కష్టపడ్డాము; ప్రతి పాత్ర యొక్క సూక్ష్మ నైపుణ్యాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది.ప్రేక్షకులకు కామెడీ మరియు డ్రామాల సమ్మేళనముగా అందించాలనేది మా లక్ష్యము.ZEE5తో మా భాగస్వామ్యముతో, 190+ దేశాలలోని ప్రేక్షకులు దీనిని వీక్షించే అవకాశం ఉంటుందని మేము సంతోషిస్తున్నాము మరియు వాళ్ళు దీనిని ఆనందిస్తారని ఆశిస్తున్నాము”.ZEE5లో మాత్రమే ‘అహ నా పెళ్ళంట’ చూసేందుకు సిద్ధంకండి!
ZEE5 భారతదేశములోని అతిచిన్న ఓటిటి ప్లాట్ఫార్మ్ మరియు వినోదం కోరుకునే వేలాదిమంది ప్రేక్షకులకు ఇది బహుభాషా కథకుడు.ZEE5 ప్లాట్ఫార్మ్ గ్లోబల్ కంటెంట్ పవర్ హౌస్ అయిన జీ ఎంటర్టెయిన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్) నుండి వచ్చింది.ఇది వినియోగదారులకు తమ ఎంపిక ఉన్న నిర్వివాదమైన వీడియో ప్రసార ప్లాట్ఫార్మ్ ; ఇది 3,500 చిత్రాలు; 1,750 టివి షోలు, 700 ఒరిజినల్స్ మరియు 5+ లక్షల ఆన్-డిమాండ్ కంటెంట్ ఉన్న విస్తారమైన మరియు వైవిధ్యమైన గ్రంధాలయం అందిస్తుంది; ఇది 12 భాషలలో కంటెంట్ అందిస్తుంది (ఇంగ్లీష్, హిందీ, బెంగాలి, మళయాళం, తమిళం, తెలుగు, కన్నడ, మరాఠి, ఒడిశా, భోజ్పురి మరియు పంజాబి).
ఇందులో బెస్ట్ ఆఫ్ ఒరిజినల్స్, భారతీయ మరియు అంతర్జాతీయ చలనచిత్రాలు, టివి షోలు, సంగీతము, పిల్లల షోలు, ఎడ్టెక్, సినీప్లేస్, వార్తలు, లైవ్ టివి మరియు అరోగ్యము & జీవనశైలి ఉంటాయి.గ్లోబల్ టెక్ డిస్రప్టర్స్ తో తన భాగస్వామ్యాల నుండి వచ్చిన ధృఢమైన డీప్-టెక్ స్టాక్ వలన ZEE5 12 నావిగేషనల్ భాషలలో అనేక పరికరాలు, ఎకోవ్యవస్థలు మరియు ఆపరేటింగ్ సిస్టమ్స్ లో అపరిమితమైన మరియు హైపర్-పర్సనలైస్డ్ కంటెంట్ వీక్షణ అనుభవాన్ని అందించగలుగుతోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy