Rahul Sipligoonj : రాహుల్ ని సత్కరించిన హైదరాబాద్ పోలీసులు.. చిచ్చా నువ్వు కేక అంటున్న నెటిజన్స్?

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌( Singer Rahul Sipliganj ) గురించి వ్యతిరేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో మంచి మంచి పాటలను పాడి సింగర్ గా మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు రాహుల్.

 Rahul Sipligunj Earlier Caught In Drunk And Driving Now He Was Honored By The S-TeluguStop.com

సినిమాల పాటలతోపాటు కొన్ని ప్రైవేట్ సాంగ్స్ కూడా పాడి ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు.కేవలం ఆడియో సాంగ్ ల ద్వారా మాత్రమే కాకుండా వీడియో సాంగ్ ల ద్వారా కూడా మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు రాహుల్.

ఇక రాహుల్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.బిగ్ బాస్ హౌస్( Bigg Boss House ) కి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకున్నాడు రాహుల్.

Telugu Hyd, Natu Natu, Rahul Sipligunj, Tollywood-Movie

ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా రాహుల్ సిప్లిగంజ్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే.అందుకు గల కారణం కూడా లేకపోలేదు.ఆర్ఆర్ఆర్ ( RRR )సినిమాలోని నాటు నాటు పాటని రాహుల్ పాడిన విషయం తెలిసిందే.ఈ సినిమా ఆస్కార్ అవార్డు( Oscar Award ) ని అందుకోవడంతో రాహుల్ పేరు మారుమోగిపోతుంది.

ఇక రాహుల్ అభిమానులు ఈ విషయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే ఈ పాటను పాడినందుకు రాహుల్ ను తాజాగా హైదరాబాద్ పోలీసులు సత్కరించారు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Telugu Hyd, Natu Natu, Rahul Sipligunj, Tollywood-Movie

కాగా గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు విషయంలో పోలీసులు రాహుల్ సిప్లిగంజ్ ని మందలించిన విషయం తెలిసిందే.ఈ విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా మారడంతో రాహుల్ ఆ విషయంపై క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.రాహుల్ ని ఏ పోలీసులు అయితే మందలించారో ఇప్పుడు అదే పోలీసులు రాహుల్ ను పిలిచి మరి సత్కరించారు.

దీంతో అభిమానులు నెటిజెన్స్ రాహుల్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ చిచ్చా నువ్వు కేక అంటూ కొందరు కామెంట్ చేయగా మరికొందరు ఒకప్పుడు నిన్ను మందలించిన పోలీసులతోనే ఇప్పుడు సత్కారం చేయించుకుంటున్నావు రియల్లీ గ్రేట్ బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా విడుదలైన రంగమార్తాండ సినిమాలో రాహుల్ సిప్లిగంజ్ నటించిన విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube