వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న జీ తెలుగు ‘నెంబర్ 1 కోడలు రాహుల్ – సరసు’ మరియు ‘త్రినయని విశాల్ – నయని

వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న జీ తెలుగు ‘నెంబర్ 1 కోడలు రాహుల్ – సరసు’ మరియు ‘త్రినయని విశాల్ – నయని

తెలుగు రాష్ట్రాల్లో నాన్‌స్టాప్‌ వినోదానికి కేరాఫ్‌ అడ్రస్ జీ తెలుగు.ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు, ఆకట్టుకునే సీరియల్స్‌, అదిరిపోయే సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తూనేఉంది.

 It Is Wedding Week On Zee Telugu,rahul,sarasu,no.1 Kodalu,nayani ,trinayani-TeluguStop.com

ఇప్పుడున్న పరిస్థితులలో అందరూ ఎంటర్టైన్మెంట్ వైపే మొగ్గు చూపుతున్న నేపథ్యంలో జీ తెలుగు తనని తాను ప్రతీరోజు ప్రజలకి అనుగుణంగా మార్చుకుంటూ, జనం యొక్క నాడిని పసిగట్టి వారిని అలరించడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తోంది.

జీ తెలుగులో చాలా సీరియల్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.అందులో భాగంగా అతి తక్కువ కాలంలో అందరి మనసును గెలుచుకున్న సీరియల్స్ నెంబర్.1 కోడలు మరియు త్రినయని.ఈ సీరియల్స్ లోని ప్రతీ పాత్ర అందరికి సుపరిచితమే.ఆకట్టుకునే కథనాలతో పాటు, అదిరిపోయే ట్విస్ట్‌లతో అలరిస్తున్న ఈ సీరియల్స్ కోసం తెలుగు ప్రేక్షకులు ఎప్పటికప్పుడు ఎదురుచూస్తుంటారు.

ఇక ఈ సీరియల్స్ లో నటిస్తున్న రాహుల్ – సరసు మరియు విశాల్ – నయని ఎప్పుడు కలుస్తారా అని ఆసక్తిగా గమనిస్తున్నారు.ఇప్పుడా సమయం వచ్చేసింది.

ఈ వారంలో, అంటే 14 నుంచి 17 జులై వరకు ఆసక్తికరంగా అబ్బురపరిచే ఘట్టాలనడుమ ఆ నలుగురి వివాహ మహోత్సవానికి బాజా భజంత్రీలు మోగబోతున్నాయి.నెంబర్ 1.కోడలు విషయానికి వస్తే ఊరి జనం అంతా కలిసి పెద్దయ్యను ఒప్పించి రాహుల్ కి ఇష్టం లేకపోయినా సరసు మేడలో తాళికటిస్తారు.అలాగే త్రినయని సీరియల్ లో విశాల్ తన తండ్రి జగదీశ్ వర్మ కోసం నయనిని పెళ్లి చేసుకుంటాడు తప్ప భార్యగా మాత్రం ఒప్పుకోడు.

లాక్‌డౌన్‌ పర్మిషన్స్‌లో భాగంగా పరిమిత సిబ్బందితో, కోవిడ్‌-19 రూల్స్‌ పాటిస్తూ ఈ పెళ్లి ఎపిసోడ్స్ షూటింగ్ చేసారు.అంతేకాకుండా బ్రేక్ సమయంలో మాస్క్లు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, చిన్నిపాటి విషయాలు కూడా గమనిస్తూ, నిత్యం సీరియల్ సెట్స్ ని శానిటైజ్ చేస్తూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాహుల్- సరసు మరియు విశాల్- నయని పెళ్లి ఎపిసోడ్స్ షూట్ చేసారు.

అద్యంతం ఆకట్టుకునే మలుపులు, అదిరిపోయే కథనంతో సాగిపోతున్న నెంబర్.1 కోడలు మరియు త్రినయని సీరియల్స్ లో రాబోయే ఎపిసోడ్స్‌ని అస్సలు మిస్‌ కాకండి.సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8 -9 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డి చానల్స్‌లో.మీ ఆప్తులుగా మేము కోరుకునేది ఒకటే, జాగ్రత్తగా ఉండండి.

మేము అందించే ఎంటర్టైన్మెంట్ ను ఆస్వాదించండి.

ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగు సబ్ స్క్రైబ్ చేసుకోండి.

జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే.

మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి.

జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కుచెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి.నెలకు కేవలం 20 రూపాయలకు మీకుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్.

మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదాకేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.

  • జీ తెలుగు గురించి
  • జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEl)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ

    తెలుగు.2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానెల్ తో సౌతిండియాలో ఎంటరైంది సంస్థ.దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు.

    ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది.విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.

    అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు.

    సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు.

    అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది.ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది.

    Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

    తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

    ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
    Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube