బిగ్‌బాస్‌ విన్నర్‌కు జోడీగా దొరసాని

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 విన్నర్‌గా నిలిచిన రాహుల్‌ సిప్లిగంజ్‌కు క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ సినిమాలో నటించే అవకాశం వచ్చిన విషయం తెల్సిందే.తనకు వచ్చిన ఆఫర్‌తో ఉబ్బి తబ్బిబవుతున్న రాహుల్‌ ప్రస్తుతం షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.

 Rahul Rangamarthanda Movie Heroin Sivathmikha-TeluguStop.com

చిన్నప్పుడు ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను.ఇప్పుడు ఆయన సినిమాల్లో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఈ సందర్బంగా రాహుల్‌ సిప్లిగంజ్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

రంగమార్తాండ సినిమాలో రాహుల్‌ సిప్లిగంజ్‌ పాత్రకు జోడీగా రాజశేఖర్‌ చిన్న కూతురు శివాత్మిక నటించబోతుంది.వీరిద్దరి కాంబో సీన్స్‌ అప్పుడే తెరకెక్కుతున్నట్లుగా సమాచారం అందుతోంది.దొరసాని చిత్రంతో నటిగా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ రంగమార్తాండ చిత్రంలో మరో కీలక పాత్రలో నటించబోతుంది.నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో రాహుల్‌ మరియు శివాత్మికలు నటించబోతున్నారు.

రమ్యకృష్ణ ప్రధాన పాత్రను చేస్తున్న ఈ సినిమాలో ప్రకాష్‌ రాజ్‌ నటిస్తున్న విషయం తెల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube